AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్‌ సమ్మర్‌లో చల్ల చల్లగా గోండ్‌ కటిరా తింటే.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు..

ఎండవల్ల శరీరంలోని శక్తి అంతా పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. గోంఢ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్​నుంచి కాపాడి, కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి సమ్మర్​లో దీనిని నానబెట్టుకుని నీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే, మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్​లలో లేదా బాదం పాలలో కలిపి తీసుకుంటే మంచిది.

హాట్‌ సమ్మర్‌లో చల్ల చల్లగా గోండ్‌ కటిరా తింటే.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు..
Gond Katira
Jyothi Gadda
|

Updated on: Mar 27, 2025 | 7:48 PM

Share

గోండ్ కటిరా.. దీనిని బాదం గమ్ అని కూడా పిలుస్తారు. దీనిని వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఎండాకాలంలో గోండ్‌ కటిరా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వినియోగం కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, మూల వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, శరీర శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం మొదలైన అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

గోండ్ కటిర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణక్రియ, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ గోండ్‌ కటిరా తినటం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి.. వేసవిలో శరీరం వేడితో ఇబ్బంది పడకుండా చేస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని, డయోరియాను తగ్గిస్తుంది. శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేటెడ్​గా ఉంచడంలో మేలు చేస్తుంది. డీహైడ్రేషన్​ను దూరం చేస్తుంది.

వేడి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఇరిటేషన్​, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. సమ్మర్​ ర్యాషెష్​లను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఎండవల్ల శరీరంలోని శక్తి అంతా పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. గోంఢ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్​నుంచి కాపాడి, కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి సమ్మర్​లో దీనిని నానబెట్టుకుని నీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే, మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్​లలో లేదా బాదం పాలలో కలిపి తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.