Vellulli Methi Curry: చపాతీలోకి అదిరిపోయే వెల్లుల్లి మెంతికూర కర్రీ.. టేస్ట్ వేరే లెవల్!
ఎప్పుడూ చేసుకునే ఆలూ కర్రీ కంటే.. ఈ సారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడిగా చపాతీల్లోకి ఈ కర్రీ వేసుకుని తింటే ఆహా అంటారు. ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది..
చపాతీలోకి ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే వంటల్లో ఎక్కువగా ఆలుగడ్డతోనే చేస్తూ ఉంటారు. కానీ ఈజీగా చపాతీల్లోకి అయిపోయే వాటిల్లో ఈ కర్రీ కూడా ఒకటి. ఎప్పుడూ చేసుకునే ఆలూ కర్రీ కంటే.. ఈ సారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడిగా చపాతీల్లోకి ఈ కర్రీ వేసుకుని తింటే ఆహా అంటారు. ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ వెల్లుల్లి మెంతి కూర ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్‌లో మెంతి కూర తినడం చాలా మంచిది. ఈ కర్రీని సులభంగానే చేయవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు.
వెల్లుల్లి మెంతి కూర కర్రీకి కావాల్సిన పదార్థాలు:
మెంతికూర, వెల్లుల్లి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, జీలకర్ర, పసుపు, గరం మసాలా, శనగలు, వేరు శనగలు, నువ్వులు, జీడిపప్పు, బటర్, ఆయిల్.
వెల్లుల్లి మెంతి కూర కర్రీ తయారీ విధానం:
ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో శనగలు, వేరు శనగలు, నువ్వులు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీలో వేసి నీళ్లు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో కొద్దిగా ఆయిల్, బటర్ వేసి.. సన్నగా కోసి వెల్లుల్లి రెబ్బలు, మెంతి కూర వేసి చిన్న మంట వేయిస్తూ ఉండాలి. పచ్చి వాసన లేకుండా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక మళ్లీ ఇదే పాన్యన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి.. జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలుపుకోవాలి.
ఉల్లిపాయలు వేగాక.. టమాటా తరుగు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. నెక్ట్స్ కారం, ఉప్పు, పసుపు వేసి మరో రెండు నిమిషాలు చిన్న మంట మీ ఉడికించుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వేసి ఓ ఐదు నిమిషాలు కడాయి మాడకుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు వేసి ఉడికించాలి. ఇక నీళ్లు దగ్గర పడుతున్న సమయంలో వెల్లుల్లి, మెంతి కూర వేసి అంతా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మెంతి కూర సిద్ధం.