పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..!

రక్తహీనత సమస్యను దూరం చేయడంలో ఫూల్‌ మఖానా సహాయపడుతుంది. కీడ్నీల్లోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. రాళ్లు ఏర్పడకుండా ఫూల్‌ మఖానా కాపాడతాయి. ఈ విధంగా ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..!
Lotus Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2024 | 10:07 PM

తామర గింజలు వేయించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిని మార్కెట్‌లో ఫూల్‌ మఖానా అని అమ్ముతారు. ఫూల్‌ మఖానా చూడడానికి తెల్లగా, గుండ్రంగా ఉంటాయి. ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తామర గింజలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అందుతాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అందే పోష‌కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తామర గింజలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని మార్కెట్‌లో ఫూల్‌ మఖానా అని అమ్ముతారు. ఈ ఫూల్ మఖానాతో చిరుతిళ్లు, కూరలను తయారు చేస్తుంటారు. ఇందులో ప్రోటీన్,ఫైబ‌ర్ శాతం అధికంగా లభిస్తుంది. ఫూల్‌ మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువుతో ఉన్నవారు ఆకలి ఎక్కువగా ఉంటే ఈ మఖానా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గుతారు.

ఫూల్‌ మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల సులభంగా బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీని వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫూల్‌ మఖానాలో మెగ్నీషియం ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకల‌ను, దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో కూడా ఫూల్ మ‌ఖానా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాపులు వంటివి త‌గ్గుతాయి.

ఇవి కూడా చదవండి

పూల్‌ మఖానాతో గుండె పనితీరును మెరుగుపరచడంలో ఫూల్‌ మఖానా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని మెగ్నిషియం, గల్లిక్ యాసిడ్స్‌ గుండెపోటు వంటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేయడంలో ఫూల్‌ మఖానా సహాయపడుతుంది. కీడ్నీల్లోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. రాళ్లు ఏర్పడకుండా ఫూల్‌ మఖానా కాపాడతాయి. ఈ విధంగా ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..