మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన పని చూస్తే..
ధుల్లో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా కొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని చందర్ విహార్ ప్రాంతంలో ఓ నైజీరియన్ వ్యక్తి పట్టపగలు మద్యం మత్తులో తన భార్యను హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధానిలోని వీధుల్లో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా కొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటన అనంతరం స్థానికులు అతడిపై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. అతడిని పట్టుకుని కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
दिल्ली के चंदर विहार में एक नाइजीरियन मूल की महिला की हत्या कर दी गई है बताया जा रहा है इस इलाके में ड्रग बेचती थी और भी बहुत सारे नाइजीरियन इस जगह पर आ कर इलीगल तरीके से रह रहे है @DelhiPolice को पता होते भी इन पर कोई एक्शन क्यों नहीं की जा रही @CPDelhi @dcpouter @LtGovDelhi pic.twitter.com/7QCdwNk0Yk
— komal Sahni (@komalsahni2004) December 2, 2024
పోలీసులు నిందితుడిని జనం నుంచి రక్షించి అరెస్ట్ చేయడం వీడియోలో కనిపిస్తోంది. పోలీసులు నైజీరియన్ వ్యక్తిని పోలీసు వాహనంలో కూర్చోబెట్టిన తర్వాత కూడా ప్రజలు అతన్ని కొట్టడం కనిపిస్తుంది. పోలీసు వాహనంపై దాడి చేసి మరీ నిందితుడిని కొట్టడం కొనసాగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..