Momos in Idli Cooker: ఇంట్లోనే ఇడ్లీ కుక్కర్‌లో వెజ్ మోమోలు.. హెల్దీగా.. టేస్టీగా..

ప్రస్తుతం మోమోస్ చాలా ఫేమస్ అయ్యాయి. చాలా మంది ఎంతో ఇష్టంగా వీటిని తింటున్నారు. మోమోస్‌ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే మోమోస్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త శ్రమ పడాలి. అందుకే బయట తింటూ ఉంటారు. కానీ బయట ఎలా చేస్తారో? శుభ్రంగా ఉంటాయో లేదో అన్న డౌట్ చాలా మందిలో ఉంటారు. మనం ఇడ్లీ కుక్కర్‌తో కూడా మోమోస్‌ తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించడం వల్ల ఇవి ఆరోగ్యానికి..

Momos in Idli Cooker: ఇంట్లోనే ఇడ్లీ కుక్కర్‌లో వెజ్ మోమోలు.. హెల్దీగా.. టేస్టీగా..
Veg Momos
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 22, 2024 | 9:24 PM

ప్రస్తుతం మోమోస్ చాలా ఫేమస్ అయ్యాయి. చాలా మంది ఎంతో ఇష్టంగా వీటిని తింటున్నారు. మోమోస్‌ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే మోమోస్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త శ్రమ పడాలి. అందుకే బయట తింటూ ఉంటారు. కానీ బయట ఎలా చేస్తారో? శుభ్రంగా ఉంటాయో లేదో అన్న డౌట్ చాలా మందిలో ఉంటారు. మనం ఇడ్లీ కుక్కర్‌తో కూడా మోమోస్‌ తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించడం వల్ల ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి సింపుల్‌గా ఇంట్లోనే టేస్టీ మోమోస్ ఎలా తయారు చేసుకోవచ్చో? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

మోమోస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

మైదా, ఉప్పు, క్యాబేజీ తురుము, క్యారెట్, క్యాప్సికమ్, బాటానీలు, బీన్స్ ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాల పొడి, సోయా సాస్, ఆయిల్.

మోమోస్ తయారీ విధానం:

ముందుగా పిండిని బాగా కలుపుకోవాలి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, నీళ్లు ఆయిల్ వేసి మెత్తగా చపాతీ పిండిలా కలపాలి. కలిపిన తర్వాత ఓ పావుగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఉల్లి కాడలు, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేగాక.. ఉప్పు, మిరియాల పొడి వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో సోయాసాస్ వేసి అన్నీ కలిపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కలిపిన పిండి తీసుకుని.. పిండిని చల్లుకుంటూ వీలైనంత సన్నగా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ ఉంచి.. మీకు నచ్చిన షేపులో చుట్టుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకుని.. నీళ్లు వేసి మరిగించాలి. ఇడ్లీ ప్లేట్ పెట్టి అందులో మోమోస్ అన్నీ పెట్టి ఓ పది నిమిషాలు మీడియం మంటపై ఉడికించు కోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెజ్ మోమోస్ సిద్ధం.

కోట్లకు పడగలెత్తిన స్వీపర్‌..అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు
కోట్లకు పడగలెత్తిన స్వీపర్‌..అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు
రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం..
రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం..
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..