Heart Patients Diet: గుండె ఆరోగ్యానికి పుష్టినిచ్చే కూరగాయలు.. ఆహారంలో వీటిని తప్పక తీసుకోవాలి

వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల సమస్య అందరిలో పెరుగుతోంది. వృద్ధులే కాదు.. పిల్లలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. క్రమశిక్షణలేని ఆహార అలవాట్లు, అనియంత్రిత జీవనశైలి ఈ వ్యాధికి మూల కారణం. జన్యుపరమైన కారణాల వల్ల కూడా చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. గుండె జబ్బుల నివారణక బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి..

Srilakshmi C

|

Updated on: Aug 22, 2024 | 1:33 PM

ఉడికించిన లేదా వండిన కూరగాయలు తినడం సులభంగా జీర్ణమవుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. ఉడకబెట్టిన కూరగాయలలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. గమనిక: వార్తల్లో ఇచ్చిన సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంటుంది. ఏదైనా సూచనను పాటించడానికి ముందు, మీరు తప్పనిసరిగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి.

1 / 5
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆహారంలో కొన్ని కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
బీట్‌రూల్‌లో అస్పరాప్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా అనేక సంక్లిష్ట వ్యాధులను నివారించవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టొమాటోల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా టమాటా తినడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయి.

3 / 5
ఆరోగ్యంగా ఉండాలంటే చిలగడదుంపలను నిత్యం తినాలి. వీటిల్లో ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని అనేక అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ వెజిటేబుల్స్ తినాలి. ఈ కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లను అధికంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు దూరమవుతాయి. కూరగాయలలో ఉండే పీచు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

5 / 5
Follow us