- Telugu News Photo Gallery Diabetes and Skin: Which skin conditions are linked to type 2 diabetes? Know here
Diabetes Warning Signs: డయాబెటిస్ రోగుల్లో చర్మ వ్యాధులు.. ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకండి
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. సైలెంట్ కిల్లర్‌లా ప్రాణాలకు హరిస్తుంది. ప్రస్తుతం చాలా మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అనారోగ్య జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మితిమీరిన ఒత్తిడి, నిద్రలేమి, బయటి ఆహారానికి అలవాటు పడడం, ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి...
Updated on: Aug 22, 2024 | 1:35 PM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. సైలెంట్ కిల్లర్‌లా ప్రాణాలకు హరిస్తుంది. ప్రస్తుతం చాలా మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అనారోగ్య జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మితిమీరిన ఒత్తిడి, నిద్రలేమి, బయటి ఆహారానికి అలవాటు పడడం, ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, దాని లక్షణాలు కొన్ని శరీరంలో కనిపిస్తాయి. తరచూ వణుకు, ఆకలి మందగించడం, తరచుగా మూత్ర విసర్జన చేయడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు చర్మంపై కూడా కనిపిస్తాయి. డయాబెటిక్ రోగులలో చర్మ సమస్యలు చాలా అరుదు. కానీ చక్కెర స్థాయి పెరిగితే చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు చర్మంపై డార్క్ ప్యాచ్‌లు కనిపిస్తాయి. మెడ, చంకలు, నడుము, మోచేతులు వంటి ప్రదేశాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తాయి. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత కూడా ఇటువంటి మచ్చలకు కారణమవుతుంది.

చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగు గుండ్రని మచ్చలు, గీతలు కనిపిస్తాయి. దీన్ని డయాబెటిక్ డెర్మటోపతి అంటారు. సాధారణంగా ఈ రకమైన మచ్చ పాదాల ముందు భాగంలో కనిపిస్తాయి. అవి బాధాకరంగా లేకపోయినా వెంటనే షుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి.

పొడి చర్మం మధుమేహం లక్షణాలలో ఒకటి. చర్మం దద్దుర్లు, దురద వంటి సమస్య పెరుగుతుంది. ఇలాంటి చర్మ సమస్యను తేలికగా తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారిలో ఏవైనా చర్మ సమస్యలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి. రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెరిగిందో తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలి.




