- Telugu News Photo Gallery Cinema photos Fans waiting on Power star pawan kalyan next movies shooting updates for his Birthday on September 02 Telugu Heroes Photos
Pawan Kalyan: ఒక్కటి.. ఒకే ఒక్కటివ్వండి చాలు.. మళ్లీ మీ జోలికి రాము.. పవన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.
ఒక్క అప్‌డేట్ స్వామి.. ఒక్కటివ్వండి చాలు.. మళ్లీ మీ జోలికి రాము.. మిమ్మల్ని డిస్టర్బ్ చేయము..! ఓజి సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ మనసులో మాట ఇదే ఇప్పుడు. మేకర్స్ కూడా ఇద్దామనే చూస్తున్నారు కానీ ఏం లాభం.. వాళ్లకు కూడా ఇవ్వాలంటే ఏదో ఓ అప్‌డేట్ ఉండాలిగా..! ఇప్పుడొచ్చింది ఆ టైమ్.. చూస్తుంటే ఓజి టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. మరి అదేంటో చూద్దామా..? పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అప్‌డేట్స్ అడగటం కంటే పెద్ద క్రైమ్ మరోటి లేదేమో..?
Updated on: Aug 22, 2024 | 2:02 PM

కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరుచుగా కాదు.. అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడో సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది.

ఎక్కడికెళ్ళినా.. ఏం చేసినా.. ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్‌డేట్సే కావాలంటున్నారు. ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తారకమంత్రంలా మారిపోయింది.

మరోవైపు ఆయన లేని సీన్స్ షూట్ చేసుకుంటున్నారు దర్శకులు. హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరుగుతుంది. దాదాపు 1000 మందితో ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు.

ఎప్పుడొస్తుందో తెలియదు.. పవన్ డేట్స్ ఎప్పుడిస్తారో ఐడియా లేదు.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు.. అయినా కూడా ఓజి ఫీవర్ మామూలుగా లేదు. నిర్మాత దానయ్య ఎక్కడ కనిపించినా ఓజి ఓజి అంటూ మోత మోగిస్తున్నారు ఫ్యాన్స్.

త్వరలోనే ఓజి తుఫాన్ వస్తుందంటూ ట్వీట్ చేసారీయన. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైంది. 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు సినిమా రిలీజ్ అయిపోతుంది. సరిగ్గా 2023 పవన్ పుట్టిన రోజు కానుకగా ఓజి టీజర్ విడుదల చేసారు మేకర్స్.

ఈ సారి మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే స్పెషల్‌గా ఓజి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. టీజర్‌లో వచ్చిన హంగ్రీ ఛీతా సాంగ్ వైరల్ అయింది. టీజర్ వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆ పాట పవర్ తగ్గలేదు.

తాజాగా థమన్ ట్వీట్ చేసారు కాబట్టి కచ్చితంగా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఉంటుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇక వీరమల్లు నుంచి ఓ టీజర్ వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం. ఉస్తాద్ భగత్ సింగ్ అప్‌డేట్‌పై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే..!




