Tomato Puli hora: టేస్టీ టమాటా పులిహోర.. లంచ్ బాక్సులోకి సూపర్ అంతే!
ఎక్కువగా చింతపండు, గోంగూర, నిమ్మకాయతో చేసే పులిహోరను తింటూ ఉంటారు. అయితే టమాటాతో కూడా పులిహోర తయారు చేసుకోవచ్చు. సాధారణంగా టమాటా రైస్ చేస్తూ ఉంటారు. ఇందులోనే కొద్దిగా మార్పులు చేస్తే టమాటా పులిహోర సిద్ధం. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది..

పులిహోర అంటే చాలా మందికి ఇష్టం. వేడి వేడిగా తింటూ ఉంటే ఆహా ఆ రుచే వేరు. ఇందులో ఏ కర్రీ అయినా వేసుకుని తినవచ్చు. పులిహోరను చాలా రకాల వాటితో తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా చింతపండు, గోంగూర, నిమ్మకాయతో చేసే పులిహోరను తింటూ ఉంటారు. అయితే టమాటాతో కూడా పులిహోర తయారు చేసుకోవచ్చు. సాధారణంగా టమాటా రైస్ చేస్తూ ఉంటారు. ఇందులోనే కొద్దిగా మార్పులు చేస్తే టమాటా పులిహోర సిద్ధం. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సుల్లోకి త్వరగా అవ్వాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. మరి ఈ టమాటా పులిహోర ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టమాటా పులిహోరకి కావాల్సిన పదార్థాలు:
టమాటాలు, ఉడికించిన రైస్, ఆయిల్, నెయ్యి, కరివేపాకు, కొత్తిమీర పచ్చి మిర్చి, తాళింపు దినసులు, చింత పండు గుజ్జు, ఇంగువ, పసుపు, ఎండు మిర్చి, ఉప్పు.
టమాటా పులిహోర తయారీ విధానం:
ముందుగా చింత పండు గుజ్జు తీసి పక్కన పెట్టండి. టమాటా, పచ్చి మిర్చి ముక్కలు కట్ చేసి వీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. చల్లారాక చింత పండు గుజ్జు వేసి మొత్తం కలపాలి. ఓ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ టమాటా చింత పండు గుజ్జు వేసి అంతా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. అదే విధంగా అన్నాన్ని కూడా ఉడికించి పక్కన పెట్టాలి. మిగిలిన అన్నం ఉన్నా పర్వాలేదు.
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో అన్నాన్ని, ఉడికించిన టమాటా చింత పండు గుజ్జు, సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి.. నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. ఇందులో తాళింపు దినుసులు, ఎండు మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించి.. అన్నంలో కలపాలి. గరిటెతో అన్నం అంతా కలిసేలా కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టమాటా పులిహోర సిద్ధం. ఈ రెసిపీని ప్రసాదంగా కూడా పెట్టొచ్చు.




