AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Cough: పొడి దగ్గు రోజంతా వేధిస్తుందా? వెంటనే ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..

మిగతా అన్ని కాలాలతో పోల్చితే.. శీతాకాలంలో వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం నిత్యం వేధిస్తుంటాయి. ముఖ్యంగా పొడి దగ్గు చిరాకు పెడుతుంటుంది. రోజంతా అదే పనిగా దగ్గడం వల్ల పరిసర ప్రాంతాల్లోని వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే..

Dry Cough: పొడి దగ్గు రోజంతా వేధిస్తుందా? వెంటనే ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..
Dry Cough
Srilakshmi C
|

Updated on: Jan 26, 2025 | 1:38 PM

Share

కొన్నిసార్లు రోజంతా దగ్గు వేధిస్తుంటుంది. పగలు, రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆ దగ్గు మరింత పెరుగుతుంటుంది. దగ్గు తగ్గేందుకు ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. పైగా దగ్గు మరింత పెరుగుతుంది. ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడానికి వంటిట్లోనే చక్కని చిట్కాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దగ్గును అణచివేయడంలో పురాతన కాలం నుంచి ఉపయోగించే ఏకైక సాధనం తేనె. తేనె దగ్గు నివారణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఇది రోజంతా వేదించే పొడి దగ్గును సులువుగా తొలగిస్తుంది. అలాగే ఛాతీలో కఫం పేరుకుపోకుండా నివారిస్తుంది. తేనె మాత్రమే తినకూడదనుకుంటే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని కూడా తాగవచ్చు. దీన్ని ఖాళీ కడుపుతో తాగితే చక్కని ప్రయోజనాలను పొందవచ్చు.

తక్కువ మంట మీద తేనెను వేడి చేసి, తర్వాత కొద్దిగా చల్లార్చి అందులో లవంగాల పొడి మిక్స్ చేసి తినాలి. ఇలా చేసినా వెంటనే పొడి దగ్గు సమస్య పరిష్కారం అవుతుంది.పొడిదగ్గు నివారణలో తేనె మాత్రమే కాదు వెల్లుల్లి కూడా గ్రేట్ గా పని చేస్తుంది. చిన్న పాత్రలో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి నెయ్యిలో బాగా వేడి చేయాలి. తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలి. ఈ విధానం కూడా చాలా ప్రయోజన కరంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తింటే, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి చక్కని రక్షణ దొరుకుతుంది. వెల్లుల్లి బలమైన వాసన కారణంగా తినడం కష్టంగా ఉంటే, దానిని తేనెతో కలపి తినవచ్చు. ఇలా తీసుకున్నా చక్కని ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

అల్లం.. జలుబు, దగ్గును తగ్గించడంలో సహాయపడుతుందని దాదాపు అందరికీ తెలుసు. కానీ దీని నుంచి తక్షణ ప్రయోజనాలను ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. టీలో అల్లం కలుపుకుని తాగితే మేలు జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే టీకి బదులు అల్లం కలిపి కాఫీ కలిపి తాగితే మరిన్ని తక్షణ ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీ అయితే మరింత మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.