Onion Pulusu: ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా రుచిగా ఉల్లిపాయల పులుసు చేయండి..
వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఈ ఉల్లిపాయల పులుసు ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ఫేమస్ వంటకం. చాలా ఈజీగా తక్కువ సమయంలోనే చేసేయవచ్చు..
ఒక్కోసారి ఇంట్లో ఎలాంటి కూరగాయలు ఉండవు. అన్నీ ఉన్నా ఒక్కోసారి ఏమీ తినాలనిపించదు. అలాంటి సమయంలో ఇలా ఉల్లిపాయల పులుసు పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఈ ఉల్లిపాయల పులుసు ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ఫేమస్ వంటకం. చాలా ఈజీగా తక్కువ సమయంలోనే చేసేయవచ్చు. ఉల్లిపాయలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కర్రీ తినడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఎవరైనా ఈజీగా చేసేయవచ్చు. మరి ఈ ఉల్లిపాయల పులుసు ఎలా తయారు చేస్తారు? ఈ ఉల్లిపాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉల్లిపాయల పులుసుకు కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా.
ఉల్లిపాయల పులుసుకి కావాల్సిన పదార్థాలు:
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక.. కరివేపాకు వేసి.. వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాలు వేగా నీళ్లు వేయాలి. నీళ్లు మరిగాక.. చింత పండు పులుసు వేసి బాగా మరిగించాలి. ఇలా పులుసు దగ్గర పడి.. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఉల్లి పాయల పులుసు సిద్ధం. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. పరోటా, చపాతీలతో కూడా తినవచ్చు. మరికెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు.