Munagaku Rice: టేస్టీ మునగాకు రైస్.. ఎలాంటి వారైనా తినేయవచ్చు!

మునగాకుతో చేసే వాటిల్లో మునగాకు రైస్ కూడా ఒకటి. మునగాకు ఎంత ఆరోగ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా టేస్టీగా తయారు చేసి కూడా పిల్లలకు అందించవచ్చు. మునగాకు రైస్ కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..

Munagaku Rice: టేస్టీ మునగాకు రైస్.. ఎలాంటి వారైనా తినేయవచ్చు!
Munagaku Rice
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2024 | 10:15 PM

మునగాకు ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో మునగాకు ఎంతో చక్కగా సహాయ పడుతుంది. మునగాకుతో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మునగాకుతో చేసే వాటిల్లో మునగాకు రైస్ కూడా ఒకటి. మునగాకు ఎంత ఆరోగ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా టేస్టీగా తయారు చేసి కూడా పిల్లలకు అందించవచ్చు. మునగాకు రైస్ కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు. మరి ఈ మునగాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.

మునగాకు రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

మునగాకు, బియ్యం, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వెల్లుల్లి, ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, తాళింపు దినుసులు, ఉప్పు, అన్నం, మిరియాల పొడి, ఆయిల్, నెయ్యి.

మునగాకు రైస్ తయారీ విధానం:

ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి నీరంతా పోయేదాకా ఆరబెట్టండి. ఆ తర్వాత అన్నాన్ని కూడా పొడి పొడిగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక.. ఎండు మిర్చి, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో మునగాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన దినుసులు, మునగాకుతో సహా అన్నీ పౌడర్‌గా మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి.. తాళింపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగిన తర్వాత ఇందులోనే అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడేలా ఉప్పు, మునగాకు పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక పెద్ద మంట పెట్టి.. అన్నాన్ని ఓ రెండు నిమిషాలు వేయించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు అన్నం సిద్ధం. ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లోకి త్వరగా అయిపోతుంది.

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!