Natukodi Pickle: నాటు కోడి నిల్వ పచ్చడి ఇలా చేస్తే మొత్తం ఊడ్చేస్తారు..
నాటు కోడి అంటే ఎగబడి మరీ తింటారు. కూర అయితే వెంటనే తినేస్తాం. కానీ ఇలా నిల్వ పచ్చడి పెడితే మాత్రం.. రోజూ తినొచ్చు. సాధారణంగా మనకు దొరికే చికెన్‌తో పెడుతూ ఉంటారు..
నాటు కోడి కూర పేరు చెబితేనే చాలా మందికి నోరు ఊరిపోతుంది. ఈ కూర అంత రుచిగా ఉంటుంది. నాటు కోడి అనేది ప్రస్తుత కాలంలో దొరకడం చాలా కష్టంగా మారింది. ధర కూడా చాలా ఎక్కువ. ఈ కూర టేస్ట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో రుచిగా ఉంటుంది. నాటు కోడి అంటే ఎగబడి మరీ తింటారు. కూర అయితే వెంటనే తినేస్తాం. కానీ ఇలా నిల్వ పచ్చడి పెడితే మాత్రం.. రోజూ తినొచ్చు. సాధారణంగా మనకు దొరికే చికెన్‌తో పెడుతూ ఉంటారు. కానీ దాని రుచి కంటే ఈ నాటుకోడి రుచి వేరు కదా.. మరి ఈ పచ్చడి ఎలా పెడతారు? అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నాటు కోడి పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
నాటుకోడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పచ్చడి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పొడి, గరం మసాలా, నిమ్మరసం.
నాటు కోడి పచ్చడి తయారీ విధానం:
ముందుగా నాటుకోడిని చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగి పక్కన కడిగి పెట్టాలి. ఇప్పుడు కరలోనే కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఓ అరగంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఓ కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేయండి. మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేయండి. నీరంతా ఇంకిపోయి.. కూర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నీరు ఇగిరి పోయాక చిన్న మంట మీద ఉడికించండి. లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన చికెన్ తీసి ఓ బౌల్ లోకి తీసుకోండి.
ఆ తర్వాత మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిన్న మంట మీదనే వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, ఆవ పొడి, పసుపు వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న మంట మీదనే ఓ ఐదు నిమిషాలు కలపాలి. ఇప్పుడు వేయించిన చికెన్ కూడా వేసి ఇందులో మళ్లీ ఫ్రై చేయాలి. కారం, మసాలాలు ముక్కకు బాగా పడతాయి. ఇలా ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసి.. స్టవ్ ఆఫ్ చేసి చల్లార నివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండి.. ఓ రెండు రోజుల పాటు పక్కన పెడితే.. ముక్క రుచిగా ఉంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే నాటు కోడి నిల్వ పచ్చడి సిద్ధం.