Gongura Chepala Pulusu: కొత్తగా గోంగూర చేపల పులుసు ఇలా చేయండి.. అమోఘం అంతే!
నాన్ వెజ్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన వాటిల్లో చేపలు కూడా ఒకటి. అందులోనూ చేపలతో చేసే ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. చేపల పులుసు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ చేపల పులుపు కాస్త వెరైటీగా ఉంటుంది. గోంగూరతో చికెన్, మటన్, రొయ్యలు తినే ఉంటారు. కానీ గోంగూర చేపలు మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు కదా..

నాన్ వెజ్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన వాటిల్లో చేపలు కూడా ఒకటి. అందులోనూ చేపలతో చేసే ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. చేపల పులుసు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ చేపల పులుపు కాస్త వెరైటీగా ఉంటుంది. గోంగూరతో చికెన్, మటన్, రొయ్యలు తినే ఉంటారు. కానీ గోంగూర చేపలు మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు కదా.. ఈ రెసిపీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంతో పాటు బ్రేక్ ఫాస్ట్‌లోకి కూడా కలిపి తినవచ్చు. ఒప్పుడూ ఒకే రకం కాకుండా.. ఇలా కాస్త వెరైటీగా ట్రై చేయండి. మరి ఈ గోంగూర చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు:
గోంగూర, చేపలు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వేయించిన మెంతి పొడి, ధనియాల పొడి, పుల్లని టమాటాలు, కొత్తి మీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, ఆయిల్.
గోంగూర చేపల పులుసు తయారీ విధానం:
ముందుగా చేపలను బాగా శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఓ గంట సేపు మ్యారినేట్ చేయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి వేడి అయ్యాక.. చేప ముక్కలు వేసి.. ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక.. ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేపల కర్రీ చేసుకునే పాన్ తీసుకుని.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించి.. నెక్ట్స్ గోంగూర వేసి ఆయిల్ పైకి తేలేంత వరకూ వేయించాలి.
ఆ తర్వాత ఉప్పు, కారం, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు పులుసుకు నీళ్లు పోసుకోవాలి. ఆ నెక్ట్స్ చేపల ముక్కలు కూడా అందులో వేసి బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. ఆయిల్ పైకి తేలక కొత్తిమీర చల్లి.. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉంటే గోంగూర చేపల పులుసు సిద్ధం.