AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుని పుట్టగొడుగుల కాఫీతో ప్రారంభించండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.. రెసిపీ మీ కోసం

కాఫీలో అనేక కలయికలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో అమెరికానో కాఫీ, ఎస్ప్రెస్సో, డబుల్ షాట్ ఎస్ప్రెస్సో, లాట్టే, మాక్ కాటో, ఫ్రాప్పే, మోచా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం మష్రూమ్ కాఫీ బాగా ప్రాచుర్యం పొందింది. అవును మీరు ఎప్పుడైనా మష్రూమ్ కాఫీ తాగారా? ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు దీనిని రోజు తాగే  సాధారణ కాఫీగా మార్చుకోవచ్చు.

రోజుని పుట్టగొడుగుల కాఫీతో ప్రారంభించండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందండి..  రెసిపీ మీ కోసం
Mushroom Coffee
Surya Kala
|

Updated on: May 17, 2024 | 7:19 PM

Share

టీ ప్రియుల మాదిరిగానే భారతదేశంలో కాఫీ ప్రియులకు కొదవలేదు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు బద్ధకాన్ని తరిమికొట్టాలనుకుంటున్నా.. లేదా ఫ్రెష్ ఫీలింగ్ రావాలనుకున్నా కాఫీ అవసరం. అప్పుడు ఒక కప్పు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఇప్పుడు కాఫీలో అనేక కలయికలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో అమెరికానో కాఫీ, ఎస్ప్రెస్సో, డబుల్ షాట్ ఎస్ప్రెస్సో, లాట్టే, మాక్ కాటో, ఫ్రాప్పే, మోచా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం మష్రూమ్ కాఫీ బాగా ప్రాచుర్యం పొందింది. అవును మీరు ఎప్పుడైనా మష్రూమ్ కాఫీ తాగారా? ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు దీనిని రోజు తాగే  సాధారణ కాఫీగా మార్చుకోవచ్చు.

చరిత్ర తరచి చూస్తే .. సమాచారం ప్రకారం మష్రూమ్ కాఫీ 1930 – 1940 మధ్య ప్రవేశపెట్టబడింది. ఇది ఔషధంగా ఉపయోగించబడింది. శక్తిని పెంచడమే కాకుండా, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. కనుక ఈ రోజు మష్రూమ్ కాఫీప్రయోజనాలు, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మష్రూమ్ కాఫీని ఎలా తయారు చేయాలంటే

ఇవి కూడా చదవండి

లయన్స్ మేన్, రిషి, చాలా, కార్డిసెప్స్ వంటి పుట్టగొడుగులను సాధారణంగా మష్రూమ్ కాఫీ కోసం ఉపయోగిస్తారు. వీటిని ఎండబెట్టి పొడి రూపంలో తయారుచేస్తారు. మష్రూమ్ కాఫీ చేయడానికి, వేడినీరు, ఇన్‌స్టంట్ కాఫీ, మష్రూమ్ పౌడర్ తీసుకోవడమే కాకుండా.. రుచికి అనుగుణంగా పాలు, స్వీటెనర్ కూడా తీసుకోవచ్చు. ముందుగా మీ అవసరానికి అనుగుణంగా కాపీని తయారు చేసి, ఆపై కాఫీ తయారు చేసే సమయంలో దానికి పుట్టగొడుగుల పొడిని జోడించండి. బాగా కలిపిన తర్వాత స్వీటెనర్‌ను జోడించండి. అంతే మష్రూమ్ కాఫీ రెడీ అవుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం మష్రూమ్ కాఫీలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఇది పుట్టగొడుగుల నాణ్యత , దీనిని తయారుచేసే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.

మెరుగైన రోగనిరోధక వ్యవస్థ కొన్ని పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.  మష్రూమ్ కాఫీని తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఒత్తిడి, అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ చాగా, రీషి, లయన్స్ మేన్ వంటి పుట్టగొడుగుల్లో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి నుంచి  రక్షించడమే కాదు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

మష్రూమ్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై ఖచ్చితమైన అధ్యయనం అందుబాటులో లేనప్పటికీ, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మొదలైనవారు, ఏదైనా ఆరోగ్య సమస్యకు మందులు వాడేవారు, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మష్రూమ్ కాఫీ తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..