ఓ మై గాడ్.. బైక్‌పై ఏకంగా పది మంది యువకుల ప్రయాణం.. కాస్త తేడా వస్తే అంతే..

ఒకరు కాదు ఏకంగా 10 మందికి పైగా యువకులు బైక్‌పై వెళ్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు. ఊహకు కూడా అందని రీతిలో బైక్‌పై కూర్చోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్‌పై కూర్చున్న వారి సంఖ్యను కూడా లెక్కిస్తున్నారు. యువకులు కూర్చున్న విధానం చూస్తే .. వారి ముందు ఉన్న కారు కూడా సరిపోదు అనిపిస్తుంది.

ఓ మై గాడ్.. బైక్‌పై ఏకంగా పది మంది యువకుల ప్రయాణం.. కాస్త తేడా వస్తే అంతే..
Viral VideoImage Credit source: Twitter
Follow us

|

Updated on: May 17, 2024 | 6:15 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏం వీడియో కనిపిస్తుందో.. ఎలాంటి సందడి చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని సార్లు వైరల్ అయ్యే వీడియోలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసిన తర్వాత ఎవరైనా తమ కళ్ళను తామే నమ్మలేరు. ఒకే బైక్‌పై ఇద్దరు కాదు 10 మందికి పైగా కూర్చుని ప్రయాణం చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మక పొతే ఈ వీడియో చూడండి. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.

మరణాన్ని ఆహ్వానిస్తున్న యువకులు

ఒకరు కాదు ఏకంగా 10 మందికి పైగా యువకులు బైక్‌పై వెళ్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు. ఊహకు కూడా అందని రీతిలో బైక్‌పై కూర్చోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్‌పై కూర్చున్న వారి సంఖ్యను కూడా లెక్కిస్తున్నారు. యువకులు కూర్చున్న విధానం చూస్తే .. వారి ముందు ఉన్న కారు కూడా సరిపోదు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒక కారులో కూడా అంతమంది కూర్చోలేరు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తమ మరణాన్ని తామే  ఆహ్వానిస్తున్నారనడంలో సందేహం లేదు. చిన్న పొరపాటు జరిగినా అందరూ తీవ్రంగా గాయపడవచ్చు.

ఆ వీడియో చూసిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఆ వీడియోపై రకరకాల స్పందన వస్తోంది. ఇది నిజంగా షాకింగ్ వీడియో అని ఒక వినియోగదారు రాశారు. ఇది వైరల్‌గా మారితే ఇప్పటి వరకు దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఒక వినియోగదారు రాశారు. ఈ విద్యావంతులందరూ మూర్ఖులని ఒక వినియోగదారు రాశారు. ఈ రోజు ఎవరైనా వైరల్ కావడానికి ఏదైనా చేయగలరని ఒక వినియోగదారు రాశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు వీడియోలో పేర్కొన్నారు. ఈ వ్యక్తులకు పోలీసులు కఠిన శిక్ష విధించాలని ఒక వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..