AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Hypertension Day 2024: హై బీపీ రోగులు వ్యాయామం చేస్తున్నారా.. తప్పనిసరిగా ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి

గత కొంత కాలం వరకూ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా యువతలో బీపీ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

World Hypertension Day 2024: హై బీపీ రోగులు వ్యాయామం చేస్తున్నారా.. తప్పనిసరిగా ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
World Hypertension Day
Surya Kala
|

Updated on: May 17, 2024 | 4:38 PM

Share

అధిక రక్తపోటు నేడు సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. దీనిని రక్తపోటు అని కూడా పిలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతదేశంలో 22 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. బీపీ ఉన్నవారిలో తలనొప్పి, అలసట లేదా గందరగోళం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, చెమట, వాంతులు  భయము వంటి లక్షణాలు కనిపించవచ్చు.

గత కొంత కాలం వరకూ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా యువతలో బీపీ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఆరోగ్యకరమైన శరీరంలో రక్తపోటు 120/80 Hg. ఏ వ్యక్తికైనా రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే.. దీనిని లో బీపీ అని అంటారు. అదే విధంగా 130/90 Hg కంటే ఎక్కువ ఉంటే హై బీపీ అని అంటారు.  అయితే బీపీ వస్తే పూర్తిగా తగ్గించుకోలేరు.. కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలరు. అందువల్ల రోజు రోజుకీ వేగంగా పెరుగుతున్న బీపీ సమస్యను నివారించడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటుతో బాధపడేవారు వ్యాయామం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి వ్యాయామం చేయాలి లేదా వ్యాయామం చేసే ముందు ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోలనేది నిపుణుల సలహా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఫిట్‌నెస్ నిపుణుడు ముకున్ నాగ్‌పన్ అధిక రక్తపోటు ఉన్న రోగులు వ్యాయామం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను చెప్పారు. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం

వ్యాయామం చేసేటప్పుడు శ్వాసపై దృష్టి పెట్టండి

వ్యాయామం చేసే సమయంలో శరీరం కష్టపడి పని చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడంపై శ్రద్ధ చూపకపోతే..  అది రక్తపోటు పెరుగుదలకు కారణమవుతుంది. అప్పుడు ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో పని చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు, శ్వాస తీసుకోవడంపై శ్రద్ధ వహించండి.

మితమైన వ్యాయామం

హై బిపి రోగులకు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ వర్కవుట్‌లు చేయమని ఎవరూ సలహా ఇవ్వరు. ఈ వ్యాయామాలను చాలా వేగంగా చేయాల్సి ఉంటుందని. రెండు వ్యాయామాల మధ్య అంతరం తక్కువగా ఉంటుంది. చాలా వేగంగా దూకడం లేదా పరుగెత్తడం వంటివి చేసే సమయంలో కండరాలు, ఎముకలు,  గుండెపై చాలా ఒత్తిడి కలుగుతుంది. అందువల్ల హై BP రోగులు వ్యాయామాన్ని మితంగా చేయాలి. అంటే, వ్యాయామం వేగంగా చేయకూడదు. సాధారణ లేదా మధ్యస్థంగా ఉండాలి.

220 మైనస్ వయస్సు ఫార్ములా

కార్డియో చేస్తున్నప్పుడు హృదయ స్పందన రేటును తెలుసుకోవడానికి, 220 మైనస్ వయస్సు ఫార్ములా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు..  ఒక వ్యక్తికి 40 సంవత్సరాలు ఉంటే, అప్పుడు 220-40 180 అవుతుంది.. అటువంటి సమయంలో గరిష్ట హృదయ స్పందన రేటు 140 ఉండాలి. కనుక నిపుణులు మీరు ఏ విధమైన వ్యాయామం చేయాలో నిర్ణయించడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..