Live Fish Drink: చేపలతో టేస్టీ టేస్టీ డ్రింక్.. బతికి ఉండగానే తాగాలంట.. ధర తెలిస్తే షాక్

లైవ్ ఫిష్ డ్రింక్ జపాన్‌కు చెందిన ఒక పానీయం. ఈ పానీయం ఒక కప్పులో దాదాపు 200 చిన్న చేపలు ఉంటాయి. వీటిల్లో ప్రతి ఒక్క చేప సజీవంగా ఉండాల్సిందే. ఎంతో నేర్పుతో చేసే లైవ్ ఫిష్ డ్రింక్ ఆ దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఖరీదైన పానీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ డ్రింక్ ఒక కప్పుకు సుమారు $60 అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 5 వేల వరకూ ఉంటుంది. దీనిని డాన్సింగ్ ఈటింగ్ అని అంటారు.

Live Fish Drink: చేపలతో టేస్టీ టేస్టీ డ్రింక్.. బతికి ఉండగానే తాగాలంట.. ధర తెలిస్తే షాక్
Live Fish Drink
Follow us
Surya Kala

|

Updated on: May 17, 2024 | 4:17 PM

నేచురల్ డ్రింక్స్ అంటే మామిడి పండు, అనాస, స్ట్రా బెర్రీ, కమలాఫలం, పుచ్చకాయ వంటి అనేక రకాల పండ్లతో తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైనా చేపలతో అది కూడా బతికి ఉన్న చేపలతో డ్రింక్ తయారు చేస్తారని.. దానిని ఎంతో ఇష్టంగా తాగుతారని మీకు తెలుసా.. అవును ప్రపంచంలో ఖరీదైన డ్రింక్స్ లో ఒకటి లైవ్ ఫిష్ డ్రింక్. ఇది చాలా జాగ్రత్తగా తయారు చేయాల్సిన పానీయం. ఈ డ్రింక్ ను తాగే సమయంలో చేపలు అన్నీ బతికి ఉండాల్సిందేనట. మరి అలాంటి ఖరీదైన డ్రింక్ ఆసియా దేశం అయిన జపాన్ లో దొరుకుతుంది.

లైవ్ ఫిష్ డ్రింక్ జపాన్‌కు చెందిన ఒక పానీయం. ఈ పానీయం ఒక కప్పులో దాదాపు 200 చిన్న చేపలు ఉంటాయి. వీటిల్లో ప్రతి ఒక్క చేప సజీవంగా ఉండాల్సిందే. ఎంతో నేర్పుతో చేసే లైవ్ ఫిష్ డ్రింక్ ఆ దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఖరీదైన పానీయంగా ప్రసిద్ధి చెందింది.

ఈ డ్రింక్ ఒక కప్పుకు సుమారు $60 అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 5 వేల వరకూ ఉంటుంది. దీనిని డాన్సింగ్ ఈటింగ్ అని అంటారు. సోయా సాస్ లో తయారు చేసే పదార్ధాలతో కలిపి అతి చిన్న సిల్వర్ ఫిష్ ను వేసుకుని అవి బతికి ఉండగానే తాగేస్తారు. చిన్న సిల్వర్ ఫిష్ లో బ్యాక్టీరియా ఉండదట. అంతేకాదు ఇలా బతికి ఉండగా తాగడానికి కారణం సిల్వర్ ఫిష్ మరణిస్తే.. కొన్ని నిమిషాల్లోనే కుళ్ళిపోవడం మొదలు అవుతాయట. చేపలు బతికి ఉండడంతో ఈ పానీయం తాగే సమయంలో కప్పు నుంచి చేపలు ఎగిరి కింద పడతాయట. అందుకనే ఈ డ్రింక్ ను తాగడం కూడా ఒక ఆర్ట్ అని అంటారు. ఎందుకంటే చేపలు పైకి క్రిందికి దూకుతాయని అందుకనే కప్పు నుంచి సిల్వర్ ఫిష్ లు జారిపోకుండా జాగ్రత్తగా తాగాలి మరి అంటున్నారు జపనీయులు. ఈ లైవ్ ఫిష్ డ్రింక్ రుచి చాలా బాగుటుందని బలమైన ప్రేరణ ఇస్తుందని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..