లే ఆఫ్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. డిఫరెంట్ గా ఆలోచించి నెలకు రూ.38 లక్షలు సంపాదిస్తున్నాడు..

అప్పటి వరకూ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా నిరుద్యోగి అవుతాడు. అప్పుడు జీవితం గడపడానికి ప్రతి పైసాపై ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది.ఎందుకంటే ఒక వ్యక్తికి డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గం మూసుకుపోతుంది కనుక. డబ్బుతోనే జీవితం గడుస్తుంది అనడం అసహజం ఏమి కాదు. అయితే ఇలా ప్రతి వ్యక్తి విషయంలో జరగాల్సిన అవసరం లేదు. పేదరికంతో బాధపడేవారు సైతం కష్టపడి పని చేసి.. తమ ఆలోచనలతో కృషి, పట్టుదలతో ప్రపంచంలో తమ పేరును లిఖించుకున్నవారు చాలా మంది ఉన్నారు.

లే ఆఫ్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. డిఫరెంట్ గా ఆలోచించి నెలకు రూ.38 లక్షలు సంపాదిస్తున్నాడు..
London Man Alfred DzadeyImage Credit source: Instagram
Follow us

|

Updated on: May 17, 2024 | 8:27 PM

ప్రస్తుతం లే-ఆఫ్ యుగం నడుస్తోంది అని అందంలో ఏ మాత్రం తప్పే లేదని అంటారు ఎవరైనా సరే..  కరోనా వైరస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న కంపెనీలే కాదు పెద్ద కంపెనీలు కూడా ఎవరినైనా సరే  తొలగిస్తున్నాయి. అప్పటి వరకూ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా నిరుద్యోగి అవుతాడు. అప్పుడు జీవితం గడపడానికి ప్రతి పైసాపై ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది.ఎందుకంటే ఒక వ్యక్తికి డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గం మూసుకుపోతుంది కనుక. డబ్బుతోనే జీవితం గడుస్తుంది అనడం అసహజం ఏమి కాదు. అయితే ఇలా ప్రతి వ్యక్తి విషయంలో జరగాల్సిన అవసరం లేదు. పేదరికంతో బాధపడేవారు సైతం కష్టపడి పని చేసి.. తమ ఆలోచనలతో కృషి, పట్టుదలతో ప్రపంచంలో తమ పేరును లిఖించుకున్నవారు చాలా మంది ఉన్నారు.

ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి  వార్తల్లో నిలిచాడు. అతనిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు, నిరాశకు గురయ్యాడు. ప్రతి పైసా కోసం ఇబ్బంది పడ్డాడు. అయితే అతను సంపాదన కోసం ఇల్లులు కొనడం  ప్రారంభించాడు. ఇప్పుడు ప్రతి నెల రూ.38 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి 31 ఏళ్ల ఆల్ఫ్రెడ్ డాజాడే. అతను ఉద్యోగం కోల్పోయినప్పుడు.. అతను ప్రతి పైసాకు ఇతరుల మీద ఆధారపడ్డాడు. ఉద్యోగం చేసే  సమయంలో కొంత డబ్బు ఆదా చేశాడు. ఈ డబ్బుతో ఆస్తి కొని, అద్దెకు ఇచ్చి.. ఆ అద్దెతో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇంటానా సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది?

ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఆల్ఫ్రెడ్ ఆలోచన అతనిని ఎంతగా మార్చిందంటే ఈ రోజు అతనికి  పోర్ట్‌ఫోలియోలో 9 భవనాలు, రూ. 47 కోట్లు ఉన్నాయి. వీటి ద్వారా అతను ప్రతి నెలా రూ. 38 లక్షలు సంపాదిస్తున్నాడు. వాస్తవాలు, గణాంకాలను పరిశీలిస్తే ఇది ఒక సాధారణ బ్రిటిష్ వ్యక్తి సగటు వార్షిక వేతనం కంటే ఎక్కువ. మీడియాకు ఆల్ఫ్రెడ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదని.. ఎందుకంటే తాను ఇక్కడకు చేరుకోవడానికి స్నేహితులను, కుటుంబాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చిందని చెప్పాడు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

తన ఇంటర్వ్యూలో మూడేళ్లలోనే తాను ఈ సంపాదన అంతా సంపాదించినట్లు చెప్పాడు. ఇప్పుడు తనకు  వేరే పని అవసరం లేదని పేర్కొన్నాడు. తన విజయానికి కారణం తన అభిరుచే కారణం అని చెప్పాడు.  ఎందుకంటే 25 సంవత్సరాల వయస్సులో నేను ఒక ఇల్లు కొన్నాను. ఉద్యోగం చేస్తూ డబ్బు ఆదా చేయడం ప్రారంభించాను. దీని తర్వాత ఉద్యోగం కోల్పోయాను. అప్పుడు ఇతరుల నుంచి పెట్టుబడిని తీసుకోవడం మొదలు పెట్టాను. అందుకు ప్రతిఫలంగా వారికి మంచి రాబడిని ఇస్తానని వాగ్దానం చేసాను. ఇప్పుడు నేను తి నా పెట్టుబడిదారులకు డబ్బులు తిరిగి ఇచ్చాను. అయినా సరే నేను ఇప్పుడు లక్షల్లో డబ్బులు  సంపాదిస్తున్నానని వెల్లడించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!