Viral Video: జెర్రిగొడ్డును అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వెన్నులో వణుకే
కప్పని పాము మింగడం సహజం. కానీ పామును, మరో సర్పం మింగడం చాలా అరుదు. ఆంధ్రాలో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కింగ్ కోబ్రా.. జెర్రిగొడ్డును అమాంతం మింగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా… దాదాపు ఐదడుగుల పొడవున్న జెర్రిగుడ్డు..! రెంటిమధ్య కొద్దిసేపు పోరాటం. జీవన పోరాటం ఒక పాము దైతే.. మరొక పాముది ఆకలికోసం ఆరాటం..! కానీ.. చివరకు కింగ్ కోబ్రా ముందు జెర్రిగుడ్డు తలవంచక తప్పలేదు. జెర్రిగుడ్డును అమాంతంగా మింగేసింది ఆ భారీ గిరినాగు. అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల మండలం రామచంద్రపురంలోని పొలంలో ఈ ఘటన జరిగింది.
పాములు సరీసృపాలు. పాములన్నీ మాంసాహారులే.. తమ ఆకలని తీర్చుకునేందుకు బల్లులు, కప్పలు, కీటకాలు, జంతువులు, గుడ్లతో పాటు అదే జాతికి చెందిన మరో పాములను కూడా తినేస్తుంటాయి. కప్పని పాము మింగడం సహజంగా చూస్తుంటాం. కానీ పామును, మరో సర్పం అమాంతంగా మింగేయడం చాలా అరుదు.
చూస్తూ ఉండగానే..
అనకాపల్లి జిల్లాల్లో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఐదడుగుల జెర్రిగుడ్డును పన్నెండు అడుగుల గిరినాగు మింగేసింది. అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల మండలం రామచంద్రపురంలో జరిగింది. గ్రామ శివారు జిమినీ జగ్గ అనే రైతు పొలంలో సుమారు 12 అడుగుల గిరినాగు జెర్రిగొడ్డు అనే పామును చూస్తుండగానే మింగేసింది.
స్నేక్ క్యాచర్ వచ్చేసరికే….
అది చూసిన రైతు ఒక్కసారి భయభ్రాంతులకు గురై స్నేక్యాచార్ వెంకటేష్‌కి సమాచారం అందించాడు ఆ రైతు . సమాచారం తెలుసుకున్న వెంకటేష్ పామున్నచోటికి రాగా.. అప్పటికే జెర్రిగొడ్డును మింగిన కింగ్ కొబ్రా అక్కడ నుంచి జారుకుంది. అయితే కింగ్ కోబ్రాలు.. జీవవైవిద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని.. తన జోలికి వెళ్లకపోతే అవి కూడా మనుషులకు ఎటువంటి హాని చేయవని అంటున్నారు స్నేక్ క్యాచర్.
జెర్రిగొడ్డును మింగిన కింగ్ కోబ్రా వీడియో దిగువన చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
