AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఆంధ్రాలో వచ్చే 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఏపీలో రాబోవు నాలుగు రోజులు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: ఆంధ్రాలో వచ్చే 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: May 17, 2024 | 7:01 PM

Share

ఐఎండి సూచనల ప్రకారం రాయలసీమ & ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోవు నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందన్నారు.

రాబోవు నాలుగు రోజుల వాతావరణ వివరాలు క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు.

18 మే, శనివారం :

• అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

19 మే, ఆదివారం :

• అల్లూరి సీతారామ రాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

20 మే, సోమవారం : • అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

21 మే, మంగళవారం : • శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

గురువారం ఉదయం 8.30గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో 131.2మిమీ, టి.సుండారులో 96.4మిమీ, గుంటూరు జిల్లా చేబ్రోలులో 67మిమీ అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. బాపట్ల జిల్లాలో 28మిమీ, గుంటూరు జిల్లాలో 21.5మిమీ, కృష్ణా జిల్లాలో 18.9మిమీ, కర్నూలు జిల్లాలో 13మిమీ, ప్రకాశం జిల్లాలో 9.3మిమీ సగటు వర్షపాతం రికార్డైనట్లు చెప్పారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా నంబుల పూలకుంటలో 84మిమీ, బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో 78మిమీ,నంద్యాల జిల్లా బేతంచెర్లలో 73.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 60మిమీ, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 56.5మిమీ, సత్యసాయి జిల్లా మడకశిరలో 50.7మిమీ, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 45.5మిమీ, ప్రకాశం జిల్లా పామూరులో 44మిమీ, శ్రీసత్యసాయి తనకల్లులో 43.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 55 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడినట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్