దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే దాచుకోవాల్సిందే..!!
కానీ అందరూ దోసకాయ తొక్కను చెత్తగా భావించి పారేస్తారు. మీరు కూడా ప్రతిరోజూ ఇంట్లో దోసకాయను ఉపయోగిస్తున్నట్టయితే, ఈ రోజు పోస్ట్ చదివిన తర్వాత, మీరు తొక్కను కూడా ఉపయోగించడం మొదలుపెడతారు. ఎందుకంటే ఆరోగ్యానికి దోసకాయ ఎంత ప్రయోజనకరమో, దాని తొక్క మీ ఇంటి పనుల్లో కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది.
వేసవి కాలంలో ప్రతి ఇంట్లోనూ కీర దోసకాయలు తింటారు. చాలా మంది ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు దీనిని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటారు. చాలా మంది దీనిని ఆహారంతో పాటు సలాడ్‌గా తినడానికి ఇష్టపడతారు. కానీ అందరూ దోసకాయ తొక్కను చెత్తగా భావించి పారేస్తారు. మీరు కూడా ప్రతిరోజూ ఇంట్లో దోసకాయను ఉపయోగిస్తున్నట్టయితే, ఈ రోజు పోస్ట్ చదివిన తర్వాత, మీరు తొక్కను కూడా ఉపయోగించడం మొదలుపెడతారు. ఎందుకంటే ఆరోగ్యానికి దోసకాయ ఎంత ప్రయోజనకరమో, దాని తొక్క మీ ఇంటి పనుల్లో కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది. దోసకాయ తొక్క సరైన ఉపయోగాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రం చేయడానికి దోసకాయ తొక్కను ఎలా ఉపయోగించాలి?
ఇంట్లోని కొన్ని వస్తువులను శుభ్రం చేయడానికి మీరు దోసకాయ తొక్కను ఈజీగా ఉపయోగించవచ్చు. దోసకాయ తొక్కలో ఉండే మూలకాలు మీ ఇంటి ట్యాప్‌ను అద్దంలా మెరిపిస్తాయి. మీరు దోసకాయ తొక్కతో గృహోపకరణాలను కూడా కొత్తవిగా మెరిసేలా చేయవచ్చు. దీనితో మీరు ట్యాప్, బకెట్, బేసిన్, సింక్ మరకలను కూడా శుభ్రం చేయవచ్చు.
దీని కోసం దోసకాయ పై తొక్కను నీటిలో ఉడకబెట్టండి. అదేలాగంటే.. ఒక పాత్రలో 2 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆ తరువాత దానిలో దోసకాయ తొక్కలను వేయండి. తొక్కను నీటిలో బాగా మరిగించండి. ఇప్పుడు ఈ నీటిని కుళాయి, బకెట్, బేసిన్, సింక్ మీద పోయాలి. ఆ తరువాత, బ్రష్‌తో తేలికగా రుద్దండి. కేవలం 5 నిమిషాల్లో మీరు అన్ని వస్తువులపై మరకలు శుభ్రంగా మాయమైపోవటం గమనిస్తారు.
ఇంటిని శుభ్రం చేయడానికి కూడా ఇది సులభమైన మార్గం :
గోడలపై పడిన మరకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలు తమ కళలను పుస్తకాల్లో కాకుండా గోడలపైనే ప్రదర్శిస్తుంటారు. కానీ పెన్సిల్, రంగు గుర్తులు మీ ఇంటి రూపాన్ని పాడు చేస్తాయి. మీ ఇంటి గోడలు మురికిగా ఉన్నాయని మీరు ఆందోళన చెందుతుంటే దోసకాయ తొక్కను ఉపయోగించండి. ఇందుకోసం ముందుగా దోసకాయ తొక్కను చేతిలోకి తీసుకుని క్రేయాన్ గుర్తులు, రంగు మరకలపై రుద్దండి. దీంతో గోడలపై ఉండే పెన్సిల్, కలర్ మార్క్స్ సులభంగా మాయమవుతాయి.
చీమలను తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుంది:
వేసవి కాలంలో ఎర్ర చీమలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. మీరు ఏ ఆహార పదార్థాన్ని ఎక్కడ పడేసినా, చీమల గుంపు మిమ్మల్ని వదిలిపెట్టదు. అయితే దోసకాయ తొక్క ఒక్క క్షణంలో మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందుకోసం చీమల దగ్గర చిన్న దోసకాయ ముక్కనైనా ఉంచితే, అవి వెంటనే కేవలం 5 నిమిషాల్లో మాయమైపోతాయి. నిజానికి చీమలు దోసకాయ వాసనను ఇష్టపడవు. మీరు చిన్న రంధ్రాలు ఉన్న ఇంటి మూలల్లో దోసకాయ తొక్కలను ఉంచవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..