అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి.. ఈ నీళ్ళు పారేయాలా, వద్దా..? తప్పక తెలుసుకోండి..

మీరు బియ్యం నుండి పూర్తి పోషకాహారాన్ని పొందాలనుకుంటే, బియ్యం పీల్చుకోగలిగినంత నీటిలో ప్రెజర్ కుక్కర్‌లో బియ్యం ఉడికించాలి. ఎక్కువ నీళ్లలో అన్నం వండడం తప్పు. మీరు వండే బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకుని అన్నం ఉడికించుకోవాలి. ఇలా చేస్తేనే దానిలోని పోషకాలు కూడా అలాగే ఉంటాయి.

అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి.. ఈ నీళ్ళు పారేయాలా, వద్దా..? తప్పక తెలుసుకోండి..
Rice Be Washed Before Cooking
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2024 | 6:22 PM

మనం రోజుకు రెండు మూడు సార్లు తినే ఆహారంలో అన్నం ముఖ్యమైనది. దేశంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు బియ్యంతో వండిన అన్నమే ఎక్కువగా తింటారు. కొన్ని రాష్ట్రాల్లో బియ్యం ప్రధాన ఆహారంగా ఉన్నాయి. బ్రౌన్ రైస్, వైట్ రైస్ అనే రెండు రకాల బియ్యాన్ని దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ప్రజలు తమ ఇష్టానుసారం అనేక రకాలుగా అన్నం వండుతారు. కొందరికి ప్లెయిన్ రైస్ ఇష్టం, మరికొందరు జీరా రైస్ ఇష్టపడతారు. మరి కొందరు వెజ్ పులావ్, బిర్యానీ రూపంలో అన్నం తీసుకుంటారు. అన్నం వండడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో తయారవుతుంది. అందుకే ఇది ప్రజలకు ఇష్టమైన భోజనం. అయితే, అన్నం వండడానికి ముందు బియ్యం కడగడం చాలా ముఖ్యం. కానీ, ఎన్ని సార్లు కడగాలి అనేది కూడా అంతే ముఖ్యం. కొందరు బియ్యాన్ని పలుమార్లు కడుగుతూనే ఉంటారు. బియ్యాన్ని ఎక్కువ సార్లు కడిగితే అందులోని మురికి, రసాయనాలు తొలగిపోతాయని వారు భావిస్తారు. కానీ, అన్నం వండేముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడగాలి.? ఎలా కడగాలి..? దీనిపై నిఫుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

బియ్యం ఎన్నిసార్లు కడగాలి..? ప్రముఖ డైటీషియన్ చెప్పిన సమాచారం మేరకు..అన్నం వండడానికి ముందు ప్రజలు చాలా పెద్ద తప్పు చేస్తుంటారు. కొందరు అన్నం వండడానికి ముందు బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టి తర్వాత చాలాసార్లు కడుగుతారు. బియ్యాన్ని పదే పదే కడగడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. బియ్యంలో ఉండే కరిగే ఫైబర్ నీటిలో కరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, ఎక్కువ నీళ్లలో బియ్యాన్ని ఉడకబెట్టి, ఆ నీటిని గంజి రూపంలో పారబోసి వడకట్టే వారు కొందరు ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు.

బియ్యాన్ని నానబెట్టి కడిగితే అన్నంలోని పోషణ అంతా తొలగిపోతుంది. అలాగే, సగం అన్నం ఉడికిన తర్వాత గంజిని వారిస్తే.. అన్నం వదులుగా ఉంటుంది. అన్నం వండేటప్పుడు ఈ రెండు తప్పులు చేస్తే వెంటనే మీ అలవాటును సరిదిద్దుకోండి. అన్నం వండే ముందు బియ్యాన్ని 3 సార్లు కడిగి, 5-10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

మీరు బియ్యం నుండి పూర్తి పోషకాహారాన్ని పొందాలనుకుంటే, బియ్యం పీల్చుకోగలిగినంత నీటిలో ప్రెజర్ కుక్కర్‌లో బియ్యం ఉడికించాలి. ఎక్కువ నీళ్లలో అన్నం వండడం తప్పు. మీరు వండే బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకుని అన్నం ఉడికించుకోవాలి. ఇలా చేస్తేనే దానిలోని పోషకాలు కూడా అలాగే ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..