అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? ఘాట్‌రోడ్డులో చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

ఉత్తరాఖండ్‌లో కొండ ప్రాంతాల గుండా తరచూ రోడ్లపై కొండచరియలు విరిగిపడతాయి. అందుకే ఎంత మంచి రోడ్డు వేసినా ఎక్కువ కాలం ఆ పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అధ్వాన్నమైన రోడ్లపై నడపాల్సి వస్తుంది. కాబట్టి, కారు టైర్లకు మంచి గ్రిప్ ఉండదు. ఫలితంగా పెను ప్రమాదాలు జరుగుతున్నాయి.

అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? ఘాట్‌రోడ్డులో చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Two Bus Crash
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2024 | 5:08 PM

అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్‌ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కానీ, కొందరు వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇందుకు నిదర్శనంగా జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌కు ఎంత అనుభవం ఉన్నా మూల మలుపుల గుండా వాహనం నడపడం ప్రమాదకరమే. ఎప్పుడు మలుపు వస్తుందో, కారు నేరుగా లోయలోకి వెళ్తుందో చెప్పలేం. కాబట్టి ఘాట్‌ రోడ్లలో నిదానంగా నడపాలని సూచిస్తారు.. కానీ వాస్తవంలో దీనిని ఎవరూ వినడం లేదు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మితిమీరిన వేగం కారణంగా ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చార్ధామ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. భక్తులతో వెళ్తున్న బస్సు కొండను ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణప్రయాగ్‌లోని నందప్రయాగ్ పుర్సాడి సమీపంలో రెండు బస్సులు ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బద్రీనాథ్ వైపు వెళ్తున్న బస్సును రిషికేశ్ వైపు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనను వెనుక నుంచి వస్తున్న వాహనంలో కూర్చున్న వ్యక్తులు తమ మొబైల్‌లో చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్ కొండ ప్రాంతం. కాబట్టి ఇక్కడి రోడ్లు చాలా వంకరగా ఉంటాయి. అంటే డ్రైవర్ నిరంతరంగా స్టీరింగ్‌ని తిప్పుతూనే ఉండాలి. ఒకవైపు పర్వతం, మరోవైపు వందల అడుగుల లోయ. ఏ కాస్త దృష్టి మరలితే ప్రమాదాలు తప్పవు. వాహనం కొండను ఢీకొంటుంది లేదా లోతైన లోయలో పడిపోతుంది. లోయ కూడా వందల మీటర్ల లోతులో ఉంటుంది. చాలా చోట్ల లోయ కింద నది ఉంటుంది.

ఉత్తరాఖండ్‌లో కొండ ప్రాంతాల గుండా తరచూ రోడ్లపై కొండచరియలు విరిగిపడతాయి. అందుకే ఎంత మంచి రోడ్డు వేసినా ఎక్కువ కాలం ఆ పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అధ్వాన్నమైన రోడ్లపై నడపాల్సి వస్తుంది. కాబట్టి, కారు టైర్లకు మంచి గ్రిప్ ఉండదు. ఫలితంగా పెను ప్రమాదాలు జరుగుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..