Watch Video: వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు.. ఆ తరువాత జరిగిన సీన్‌ చూసి అంతా షాక్‌..!

రైలు పట్టాలపై ఆవు ఉండటం గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ వందే భారత్‌ రైలు ఇంజిన్‌ కింద ఆవు వెనుక భాగం చిక్కుకుంది. దాంతో లోకో పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి రైలును వెనక్కి కదిలించాడు. దాంతో ఆవు తనంతట తానుగా లేచి సురక్షితంగా ట్రాక్ దాటింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Watch Video: వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు.. ఆ తరువాత జరిగిన సీన్‌ చూసి అంతా షాక్‌..!
Vande Bharat Express
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2024 | 3:31 PM

వేగంగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఢీకొన్ని ఇప్పటివరకు చాలా పశువులు ప్రమాదవశాత్తు మరణించాయి. అయితే ప్రస్తుతం, ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కానీ, సంఘటన చూసిన ప్రతిఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోమోటివ్ పైలట్ సమయస్పూర్తి, అతనిలోని మనవత్వం ఆ నోరులేని మూగజీవికి ప్రాణం పోసింది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనుక భాగం రైలు ఇంజిన్‌ ముందు ఇరుక్కుపోయింది. అయితే లోకో పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి ఆవు ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. దాంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లోకో పైలట్‌ చేసిన పనికి ప్రజలు ప్రశంసించారు. అలాగే పశువులు రైలు పట్టాలపైకి రాకుండా రైల్వే అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు ఈ కేసు ఏంటో చూద్దాం..

వీడియోలో కనిపిస్తున్నట్లుగా, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఒక ఆవు పడుకుని ఉంది. అదృష్టవశాత్తూ అదే లైన్‌లో వస్తున్న రైలు వేగం తక్కువగా ఉండడంతో లోకో పైలట్‌కు ఆవు దూరం నుంచి కనిపించింది. దాంతో ఎమర్జెన్సీ బ్రేక్‌ కొట్టి కారును ఆపాడు. ఆవు శరీరం సగభాగం ఎక్స్‌ప్రెస్‌ కింద ఇరుక్కుపోయి వేదనకు గురైంది. కానీ ప్రాణాలతోనే ఉంది. ఆవు ప్రాణాలను కాపాడే క్రమంలో లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. రైలు పట్టాలపై ఆవు ఉండటం గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ వందే భారత్‌ రైలు ఇంజిన్‌ కింద ఆవు వెనుక భాగం చిక్కుకుంది. దాంతో లోకో పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి రైలును వెనక్కి కదిలించాడు. దాంతో ఆవు తనంతట తానుగా లేచి సురక్షితంగా ట్రాక్ దాటింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లోకో పైలట్‌ సకాలంలో ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆ ఆవు ప్రాణాలతో బయటపడిందంటూ సోషల్ మీడియా వినియోగదారులు అతన్ని కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..