AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట కనిపించే ఈ 5 లక్షణాలు మధుమేహానికి సంకేతాలు..! నిర్లక్ష్యం వద్దు..

డయాబెటిక్.. దీనినే మధుమేహం, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. చాపకింద నీరులా సోకే వ్యాధి ఇది. ఒక్కసారి వచ్చిందంటే.. తగ్గిపోవటం అనేది ఉండదు. కానీ, అదుపులో ఉంచుకోగలిగేది. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మరి, దీన్ని గుర్తించడం ఎలా? లక్షణాలు ఏమిటీ? మధుమేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తదితర వివరాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

Jyothi Gadda
|

Updated on: May 16, 2024 | 9:17 PM

Share
Diabetes

Diabetes

1 / 5
తరచూ పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. రాత్రుళ్లు నిద్రలో దాహం వేయటం, పదే పదే లేవడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఇది కూడా మధుమేహానికి సంకేతం. శరీరంపై గాయాలు త్వరగా మానవు. అతిగా ఆకలి వేస్తుంది. కాళ్లలో స్పర్శ తగ్గుతుంది. కొంతమందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.

2 / 5
రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లే. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం. శృంగార కోరికలు సన్నగిల్లడం. చర్మం ముడత పడటం.

3 / 5
కొంతమందిలో ఫ్యాన్‌ ఫుల్‌ స్పీడ్‌తో తిరుగుతున్నప్పటికీ ఒంటిపై చెమటలు పడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒకసారి మీ గ్లూకోజ్ స్థాయిని చెక్ చేసుకోండి. ఇది కూడా మధుమేహానికి సంకేతం కావొచ్చు.  
టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.

కొంతమందిలో ఫ్యాన్‌ ఫుల్‌ స్పీడ్‌తో తిరుగుతున్నప్పటికీ ఒంటిపై చెమటలు పడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒకసారి మీ గ్లూకోజ్ స్థాయిని చెక్ చేసుకోండి. ఇది కూడా మధుమేహానికి సంకేతం కావొచ్చు. టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.

4 / 5
ఇకపోతే, డయాబెటిక్‌ బాధితులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు శారీరక శ్రమ అవసరం. అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఆఫీసుల్లో ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సిన వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో లేచి చిన్న చిన్న వ్యాయమాలు చేయండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తదితర వంటకాలకు దూరంగా ఉండండి. మధుమేహం ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి.

5 / 5