Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (మే 18, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. వృషభ రాశి వారు కొందరు మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారు ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభం పొందుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 18, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. వృషభ రాశి వారు కొందరు మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారు ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభం పొందుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రతిఫలం బాగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుం టారు. బంధువుల నుంచి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులుంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకూ లంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుందిఝ కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొందరు మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశముంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆశిం చిన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభం పొందుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొందరు బంధువుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధి స్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సొంత ఆలోచనల ద్వారా లభ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితం సీదా సాదాగా సాగిపో తుంది. తోటి ఉద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. కార్యకలాపాలు, లావాదేవీలు విస్తరించే అవ కాశం ఉంది. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశముంది. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలపరంగా బలం పుంజుకుంటాయి. ఊహించని విధంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. తల్లితండ్రుల కారణంగా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మంచి ఉద్యో గంలోకి మారే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఏ రంగా నికి చెందిన వారైనప్పటికీ ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలు సీదా సాదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం మారే విష యంలో పునరాలోచించడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. వివాహ ప్రయ త్నాలు ఫలవంతం అవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది., ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ధన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపో తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత పనుల్నిసకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల వల్ల ఇబ్బందుల పడతారు. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవు తాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి అవకాశముంది. కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.