Fish Fingers Recipe: రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫింగర్స్‌ని ఇలా ఈజీగా ఇంట్లో కూడా చేయవచ్చు!
చాలా మందికి రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కాస్త సమయం దొరికినప్పుడల్లా.. రెస్టారెంట్లలో వాలిపోతూ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఫిఫ్‌తో చేసుకోదగిన వాటిల్లో ఫిష్ ఫింగర్స్ కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వెజ్ ఫింగర్స్ లేదా చికెన్ ఫింగర్స్ తిని ఉంటారు. కానీ ఫిఫ్ ఫింగర్స్ చాలా తక్కువ మంది తింటారు. పార్టీలో చేసుకోదగిన స్నాక్స్‌లో వీటిని కూడా చేసుకోవచ్చు. సాధారణంగా చేపలతో తరచూ ఒకే రకం వంటకాలు కాకుండా ఇలా..
చాలా మందికి రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కాస్త సమయం దొరికినప్పుడల్లా.. రెస్టారెంట్లలో వాలిపోతూ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఫిఫ్‌తో చేసుకోదగిన వాటిల్లో ఫిష్ ఫింగర్స్ కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వెజ్ ఫింగర్స్ లేదా చికెన్ ఫింగర్స్ తిని ఉంటారు. కానీ ఫిఫ్ ఫింగర్స్ చాలా తక్కువ మంది తింటారు. పార్టీలో చేసుకోదగిన స్నాక్స్‌లో వీటిని కూడా చేసుకోవచ్చు. సాధారణంగా చేపలతో తరచూ ఒకే రకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా ఫింగర్స్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. చేపలతో రుచిగా క్రిస్పీగా ఫింగర్స్‌ను తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఫిష్ ఫింగర్స్‌ని ఎలా తయారు చేసుకుంటారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిష్ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చేపలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, మిరియాల పొడి, నిమ్మ రసం, కోడి గుడ్డు, కొత్తి మీర, చిన్న తరిగిన పచ్చి మిర్చి, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ పేస్ట్, మైదా పిండి, బ్రెడ్ క్రంబ్స్,
ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం:
ఫిష్ ఫింగర్స్ కోసం ముందుగా చేపలను శుభ్రంగా క్లీన్ చేసి.. ముల్లు తీసి పక్కకు పెట్టుకోవాలి. వీటిని ఫింగర్స్ ఆకారంలో పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత నిమ్మ రసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. నెక్ట్స్ మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్లో బ్రెడ్ క్రంబ్స్, ఆయిల్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఈలోపు కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి బ్రెడ్ క్రంబ్స్‌ని తీసుకోవాలి. చేప ముక్కలను బ్రెడ్ క్రంబ్స్‌తో ఒకసారి కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని ఆయిల్ వేసి.. మీడియం మంటపై వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫింగర్స్ రెడీ అవుతాయి. వీటిని పిల్లలకు పెడితే.. ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు.