Tawa Pulao: తవా పులావ్ ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్ ఉంటుంది అంతే!
ఇంటి నిండా కూరగాయలు ఉన్నా.. లేనప్పుడైనా ఒక్కోసారి ఏం వండాలో తెలీదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్‌గా, స్పెషల్‌గా ఏమైనా చేసుకుని తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తవా పులావ్ చాలా బెస్ట్. సింపుల్‌గా టేస్టీగా చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో ఎవరూ అన్నం తినకపోయినప్పుడు మిగిలినప్పుడైనా.. ఇలా తవా పులావ్ చేసుకుని తింటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్ట పడి ఈ పులావ్ తింటారు. స్ట్రీట్ స్టైల్‌లో తవా పులావ్..
ఇంటి నిండా కూరగాయలు ఉన్నా.. లేనప్పుడైనా ఒక్కోసారి ఏం వండాలో తెలీదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్‌గా, స్పెషల్‌గా ఏమైనా చేసుకుని తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తవా పులావ్ చాలా బెస్ట్. సింపుల్‌గా టేస్టీగా చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో ఎవరూ అన్నం తినకపోయినప్పుడు మిగిలినప్పుడైనా.. ఇలా తవా పులావ్ చేసుకుని తింటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్ట పడి ఈ పులావ్ తింటారు. స్ట్రీట్ స్టైల్‌లో తవా పులావ్ ను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ పులావ్‌ను ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తవా పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:
అన్నం లేదా బియ్యం, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, బటర్, ఆయిల్, ఉల్లి పాయ, పచ్చి మిర్చి, టమాటాలు, పచ్చి బఠాణి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పావ్ భాజీ మసాలా, నిమ్మ రసం, కొత్తి మీర.
తవా పులావ్ తయారీ విధానం:
ముందుగా నార్మల్ రైస్ లేదా బస్మతీ బియ్యంతో పొడి పొడిగా అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. రైస్‌ని ముందుగా వండి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి తీసుకుని.. అందులో ఆయిల్, కొద్దిగా బటర్ వేసి.. వేయించాలి. తర్వాత జీలకర్ర, ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక.. టమాట ముక్కలు, బఠాణీ వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడ్డాక.. ఉప్పు, కారం, పసుపు వేసి మిగిలిన పొడులు కూడా వేసి ఒకసారి కలపాలి.
ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు మాడి పోకుండా నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఆ తర్వాత అన్నం వేసి.. అంతా కలిసేలా కలుపుకోవాలి. అవసరం అయితే కొద్దిగా బటర్ వేసుకోవచ్చు. నెక్ట్స్ కొత్తి మీర కూడా అంతా చల్లుకుని.. మరొక సారి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే తవా పులావ్ సిద్ధం. సర్వింగ్ ప్లేట్స్‌లోకి సర్వ్ చేసుకుని తినడమే. దీన్ని నార్మల్‌గా తిన్నా లేదా రైతాతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అస్సలు వదిలి పెట్టారు.