Diabetes Prevention Foods: ఈ ఆహారాలు తింటే మధుమేహం జీవితంలో రాదు.. మీ ఆహారంలో వీటిని తప్పక చేర్చుకోండి
కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. స్థిరమైన రక్త స్థాయిలను నిర్వహించడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అధిక చక్కెర, కార్బోహైడ్రేట్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉంటే, మీకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. స్థిరమైన రక్త స్థాయిలను నిర్వహించడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అధిక చక్కెర, కార్బోహైడ్రేట్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉంటే, మీకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఈ 10 ఆహారాలను తినాలి.
ఏయే ఆహారాలు తీసుకోవాలంటే..
- వైట్ రైస్‌కు బదులుగా ఎరుపు లేదా బ్రౌన్ రైస్ తినడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. మైదాకు బదులుగా మిల్లెట్, మొక్కజొన్న పిండిని ఉపయోగించాలి. కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ వంటి కాయధాన్యాలు తినాలి. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర పెరగనీయవు. వీలైనంత ఎక్కువగా చిక్‌పీస్, పప్పు దినుసులు తినాలి.
- పాలకూర వంటి ఆకుకూరలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా విటమిన్లు, ఫైబర్‌ను అందిస్తుంది.
- అవకాడోస్, బాదం, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి.
- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న సాల్మన్ రక్తంలో చక్కెరను పెరగనీయదు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి.
- రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం వెల్లుల్లిలో ఉంటుంది.
- గుడ్లు, పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
- దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- దోసకాయలు అధిక నీటి కంటెంట్, తక్కువ కేలరీలు కలిగిన పోషకమైన ఆహారం. వీటిని తినడం వల్ల మధుమేహం దరి చేరదు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.