AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Mental Health: మగువల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు.. బీ కేర్‌ ఫుల్!

ఆరోగ్యవంతమైన జీవితానికి శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ నేటి బిజీ లైఫ్‌ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. ముఖ్యంగా మహిళలు తరచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. ఎందుకంటే వారికి ఆఫీసుతో పాటు ఇంట్లో కూడా బాధ్యతలు ఉంటాయి. దీని కారణంగా వారు తమ కోసం తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అనేక మంది మహిళలు మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు..

Women Mental Health: మగువల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు.. బీ కేర్‌ ఫుల్!
Women Mental Health
Srilakshmi C
|

Updated on: Jan 15, 2024 | 4:14 PM

Share

ఆరోగ్యవంతమైన జీవితానికి శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ నేటి బిజీ లైఫ్‌ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. ముఖ్యంగా మహిళలు తరచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. ఎందుకంటే వారికి ఆఫీసుతో పాటు ఇంట్లో కూడా బాధ్యతలు ఉంటాయి. దీని కారణంగా వారు తమ కోసం తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అనేక మంది మహిళలు మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వారు దానిని గుర్తించరు. శరీరంలో జరుగుతున్న మార్పులను వారు విస్మరిస్తుంటారు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను దారితీస్తుంది. మహిళల్లో మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలను గుర్తించడం ఎలా..? వారిలో కనిపించే లక్షణాల ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. తద్వారా సకాలంలో చికిత్స తీసుకోవడానికి వీలుంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

మానసిక అనారోగ్యం ఎవరికైనా సంభవించవచ్చు. కానీ స్త్రీలలో దాని లక్షణాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. మహిళల్లో మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • జీవసంబంధమైన కారణాలు.. స్త్రీల మెదడు పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగంతో ఉంటారు. దీని కారణంగా వారు సులభంగా నిరాశకు గురవుతారు.
  • సామాజిక ఒత్తిడి.. పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ సామాజిక ఒత్తిడి ఉంటుంది. స్త్రీ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లలు – కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలి, బాధ్యతతో ఉండాలి వంటి ఆంక్షలు పెడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మహిళలు మానసికంగా అనారోగ్యానికి గురవుతారు.
  • లింగ వివక్ష.. స్త్రీలు సమాజంలో లింగం ఆధారంగా వివక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా వారు మరిన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  • లైంగిక వేధింపులు.. మహిళలు తరచుగా శారీరకంగా, లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురవుతుంటారు. దీని కారణంగా వారి మానసిక ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.

మహిళల్లో మానసిక అనారోగ్యం లక్షణాలను ఎలా గుర్తించాలి..

  • ఒక మహిళ దీర్ఘకాలంగా విచారంగా లేదా నిరుత్సాహానికి గురైతే ఇది మానసిక ఆరోగ్య సమస్యల లక్షణాలుగా పరిగణిస్తారు. తరచుగా మహిళలు తమ భావాలను దాచుకుంటారు. ఇది భవిష్యత్తులో వారి మానసిక ఆరోగ్యానికి హానికరం.
  • మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలు వ్యక్తులకు దూరం ఉంటారు. ఏ కార్యకలాపాలలో పాల్గొనరు.
  • మహిళలు నిద్రించే సమయం మారడం కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు కారణం.
  • ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండానే మహిళల మూడ్‌లో చాలా మార్పులు వస్తే, ఆమె మానసిక ఆరోగ్యం బాగాలేదని అర్థం.
  • మితిమీరిన ఆందోళన కూడా మానసిక రుగ్మత లక్షణం.
  • మహిళల శరీర బరువు పెరగడం లేదా తగ్గడం కూడా ఏదో ఒక విధంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. అంతేకాకుండా ఎక్కువ లేదా తక్కువ ఆకలిగా అనిపించడం కూడా మానసిక అనారోగ్యం ముఖ్య లక్షణం.
  • మహిళలు అధికంగా అలసిపోయినట్లయితే, ఇది మానసిక ఆరోగ్య సమస్యను కూడా సూచిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.