Kiwi Benefits: ఆస్తమా పేషెంట్స్‌కి బెస్ట్ ఫ్రూట్ కివీ.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!
ప్రస్తుతం కివీ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫ్రూట్ అన్ని మార్కెట్లలో లభ్యమవుతుంది. అంతే కాకుండా చిన్న పల్లెటూర్లలలో కూడా ఇవి లభ్యమవుతున్నాయి. చాలా మంది ఇప్పుడు వీటిని ఇష్టంగా తింటున్నారు. జ్యూస్‌లు, సలాడ్స్‌లో వీటిని యాడ్ చేసుకుంటున్నారు. కివీలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నిజానికి కివీ ఫ్రూట్.. విదేశీ పండు. కానీ ఇప్పుడు లోకల్‌లో కూడా పాపులర్ అయ్యింది. కివీలో విటమిన్లు ఎ, ఇ, సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా..
ప్రస్తుతం కివీ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫ్రూట్ అన్ని మార్కెట్లలో లభ్యమవుతుంది. అంతే కాకుండా చిన్న పల్లెటూర్లలలో కూడా ఇవి లభ్యమవుతున్నాయి. చాలా మంది ఇప్పుడు వీటిని ఇష్టంగా తింటున్నారు. జ్యూస్‌లు, సలాడ్స్‌లో వీటిని యాడ్ చేసుకుంటున్నారు. కివీలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నిజానికి కివీ ఫ్రూట్.. విదేశీ పండు. కానీ ఇప్పుడు లోకల్‌లో కూడా పాపులర్ అయ్యింది. కివీలో విటమిన్లు ఎ, ఇ, సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. కివీని మీ డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా బైబై చెప్పొచ్చు. ఇంకా కివీతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెయిట్ కంట్రోల్ అవ్వొచ్చు:
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కివీ ఫ్రూట్‌ని ఎలాంటి డౌట్స్ లేకుండా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కుకవగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి కూడా వేయదు. దీంతో జంక్ ఫుడ్ కంట్రోల్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ కారణంగా.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఇలా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
కివీలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. కాబట్టి దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో జబ్బుల బారిన తక్కువగా పడతారు. జలుబు, ఫ్లూ, ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇతర సమస్యలతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. అదే కాకుండా వాపు, క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.
ప్రశాంతమైన నిద్ర కోసం..
నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు కివీని చక్కగా తీసుకోవచ్చు. కివీ తినడం వల్ల నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటినాయిడ్స్ వంటివి కూడా నిద్రను ప్రోత్సహిస్తాయి.
ఆస్తమా పేషెంట్స్‌కి బెస్ట్:
కివీ ఫ్రూట్‌లో పెద్ద మొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి. ఇవి రెండూ ఊపిరి తిత్తుల పని తీరును మెరుగు పరుస్తుంది. ఆస్తమా పేషెంట్స్ కివీస్ తినడం వల్ల శ్వాస కోశ సమస్యలు అనేవి తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.