AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almond Side Effects: బాదం పప్పు ఎక్కువగా తీసుకుంటే.. అంత ప్రమాదమా!

ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అమృతం. మితి మీరి తీసుకుంటే ప్రమాదమన్న విషయం మీకు తెలుసా? ఈ విషయాన్ని మన ఇంట్లో పెద్దలు, వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే సంగతి బాదం పప్పుకు కూడా వర్తిస్తుంది. బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి..

Almond Side Effects: బాదం పప్పు ఎక్కువగా తీసుకుంటే.. అంత ప్రమాదమా!
అలాగే బాదం షేక్ చేసి కూడా తాగొచ్చు. కానీ బాదంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు పెరగడానికి దారితీయవచ్చు. అందుకే వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
Follow us
Chinni Enni

|

Updated on: Jan 15, 2024 | 3:07 PM

ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అమృతం. మితి మీరి తీసుకుంటే ప్రమాదమన్న విషయం మీకు తెలుసా? ఈ విషయాన్ని మన ఇంట్లో పెద్దలు, వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే సంగతి బాదం పప్పుకు కూడా వర్తిస్తుంది. బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా లభ్యమవుతాయి. ప్రతి రోజూ బాదం పప్పు తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ గింజలు తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

కానీ బాదం పప్పు ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అతిగా తింటే ప్రయోజనాలకు బదులుగా.. ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అతిగా తింటే ప్రయోజనాలకు బదులుగా.. ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపించవచ్చు. బాదం పప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు చూడండి.

జీర్ణ సమస్యలు..

బాదం పప్పులో విటమిన్ ఇ అనేది మెండుగా ఉంటుంది. ఇది మితంగా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా చర్మం, కళ్లు కూడా ఆరోగ్యం పని చేస్తాయి. అయతే బాదం మరీ ఎక్కువగా తీసుకుంటే ఇందులో విటమిన్ ఇ వల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు సంభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి..

బాదం ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇందులో కేలరీలు, కొవ్వ ఉంటాయి కాబట్టి.. వెయిట్ పెరిగేందుకు కారణం అవుతాయి. అలాగే బాదంలో ఆక్సలేట్ ఉంటుంది. దీని వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ సమస్యలు కూడా తెలెత్త వచ్చు.

ఖనిజాల లోపం..

బాదంలో వివిధ రకాల పోషకలు, ఖనిజాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే వాటి శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి. వాటి లోపం లేకుండా చేస్తాయి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖనిజాల లోపం ఏర్పడుతుంది.

ఇతర సమస్యలు కూడా..

అంతే కాకుండా బాదం పప్పు ఎక్కువగా తీసుకుంటే కొందరిలో అలర్జీ కూడా వస్తుంది. దద్దుర్లు, ముఖంపై వాపు, దురదలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.