Hair Growth Tips: జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఇవి ఖచ్చితంగా తినాల్సిందే!

జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే.. జుట్టు అనేది ఊడిపోకుండా బలంగా ఉంటుంది. జుట్టు ఊడిపోయినప్పటికీ.. వాటి స్థానంలో మళ్లీ కొత్త జుట్టు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలహీన పడటం వల్ల లేదా దెబ్బతినడం వల్ల ఊడిన జుట్టు స్థానంలో మరలా కొత్త జుట్టు రాకుండా పోతుంది. జుట్టు ఆరోగ్యం అంతా కూడా జుట్టు కుదళ్లపైనే ఆధారపడి ఉంటుంది. కనుక జుట్టు కుదుళ్లను బలపరిచే చర్యలు తీసుకోవాలి. కుదుళ్లు బలంగా ఉండాలంటే..

Hair Growth Tips: జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఇవి ఖచ్చితంగా తినాల్సిందే!
Hair Care
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 2:00 PM

జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే.. జుట్టు అనేది ఊడిపోకుండా బలంగా ఉంటుంది. జుట్టు ఊడిపోయినప్పటికీ.. వాటి స్థానంలో మళ్లీ కొత్త జుట్టు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలహీన పడటం వల్ల లేదా దెబ్బతినడం వల్ల ఊడిన జుట్టు స్థానంలో మరలా కొత్త జుట్టు రాకుండా పోతుంది. జుట్టు ఆరోగ్యం అంతా కూడా జుట్టు కుదళ్లపైనే ఆధారపడి ఉంటుంది. కనుక జుట్టు కుదుళ్లను బలపరిచే చర్యలు తీసుకోవాలి. కుదుళ్లు బలంగా ఉండాలంటే.. రక్త ప్రసరణ అనేది బాగా జరగాలి.

రక్త ప్రసరణ ఎక్కువగా ఉండాలంటే.. శరీరంలో తగినంత రక్తం ఉండటం చాలా అవసరం. రక్త ప్రసరణ సరిగ్గా ఉంటేనే.. జుట్టు కుదుళ్లకు పోషకాలు అనేవి ఎక్కువగా అందుతాయి. జుట్టు కుదుళ్లలో ఉండే వ్యర్థాలు కూడా తొలగించబడతాయి. శరీరంలో రక్తాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు కావాలి.

ఆకు కూరల్లో బోలెడన్ని పోషకాలు..

విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే పోషకాల్లో ఆకు కూరాలు కూడా ఒకటి. గోంగూర, బచ్చలి కూర, పాల కూర, తోట కూర, మెంతి కూర, పొన్న గంటి కూర వంటి ఆకు కూరలు రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కంది పప్పు, పెసరపప్పు వంటి వాటితో కూడా కలిపి ఆకు కూరలు తినొచ్చు. ఆకు కూరలు తినడం వల్ల ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇ, కె వంటి పోషకాలు జుట్టుకు అందుతాయి. దీని వల్ల కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉంటాయి. రోజూ ఆకు కూరలు వండుకుని తినడం వల్ల జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. దాంతో జుట్టు కుదళ్లు బలంగా తయారవుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు రాలినా.. మళ్లీ కొత్త జుట్టు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

స్త్రీలు ఎక్కువగా ఆకు కూరలను పప్పులతో వండుకుని తినడం వల్ల వారిలో రక్త హీనత అనేది తగ్గుతుంది. రక్త హీనత కారణంగా జుట్టు రాలి పోతుంది. ఆకు కూరలు తినడం వల్ల కేవలం జుట్టు సమస్యలే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మెరుగు పడతాయి. అదే విధంగా రాజ్మా, సోయా, నానబెట్టిన పుచ్చ గింజలు, డ్రైఫ్రూట్స్ కూడా జుట్టు బలంగా ఉండేందుకు సహయ పడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Latest Articles
మద్యం మత్తులో మైనర్.. 200 కి.మీ. స్పీడ్‌తో డ్రైవింగ్.. సీన్ కట్ చ
మద్యం మత్తులో మైనర్.. 200 కి.మీ. స్పీడ్‌తో డ్రైవింగ్.. సీన్ కట్ చ
మీ డబ్బులకు భరోసా, మంచి రిటర్న్స్‌.. రెండేళ్లలోనే..
మీ డబ్బులకు భరోసా, మంచి రిటర్న్స్‌.. రెండేళ్లలోనే..
ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్
ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్
నటి హేమ చెప్పింది అబద్ధమా..? ఆమె మాటల్లో నిజమెంతా..?
నటి హేమ చెప్పింది అబద్ధమా..? ఆమె మాటల్లో నిజమెంతా..?
రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!
రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్