AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Kurma: ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ చేయమంటారు..

కోడి గుడ్లతో ఎన్నో రకాల వెరైటీ వంటలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో ఈ ఎగ్ కూర్మా కూడా ఒకటి. వీటిని ఎక్కువగా రెస్టారెంట్లలో తయారు చేస్తారు. పులావ్, అన్నం, రోటీ, చపాతీ దేనిలోకైనా టేస్ట్ అదిరిపోతుంది. ఇది చేయడం కూడా చాలా సింపు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఎప్పుడైనా వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి అనిపిస్తే ఈ ఎగ్ కూర్మా ట్రై చేయండి. తిన్న వాళ్లు మీకు ఫ్యాన్ అయిపోతారు. మరి ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ కూర్మాను ఎలా తయారు..

Egg Kurma: ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ చేయమంటారు..
Egg Kurma
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 27, 2024 | 3:15 PM

Share

కోడి గుడ్లతో ఎన్నో రకాల వెరైటీ వంటలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో ఈ ఎగ్ కూర్మా కూడా ఒకటి. వీటిని ఎక్కువగా రెస్టారెంట్లలో తయారు చేస్తారు. పులావ్, అన్నం, రోటీ, చపాతీ దేనిలోకైనా టేస్ట్ అదిరిపోతుంది. ఇది చేయడం కూడా చాలా సింపు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఎప్పుడైనా వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి అనిపిస్తే ఈ ఎగ్ కూర్మా ట్రై చేయండి. తిన్న వాళ్లు మీకు ఫ్యాన్ అయిపోతారు. మరి ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ కూర్మాను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ కూర్మ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, పల్లీలు, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, పెరుగు, కరివేపాకు, కొత్తి మీర, పుదీనా, ఆయిల్ లేదా నెయ్యి.

ఎగ్ కూర్మ తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టండి. ఇందులో వేరు శనగ, నువ్వులు, గసగసాలు, ఎండుకొబ్బరి వేసి దోరగా వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత కర్రీ పాన్‌లో ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేంత వరకూ వేయించాలి. వీటిని కూడా ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. దీన్ని మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. నెక్ట్స్ కడాయిలో మళ్లీ ఆయిల్ వేసి.. జీలకర్ర వేసి వేయించాలి. నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి.

ఇవి కూడా చదవండి

తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకూ వేయించాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మాసాలా, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నీళ్లు వేసి బాగా ఉడికించాలి. ఆయిల్ పైకి తేలాక.. ఉడికించిన గుడ్లు, కొత్తి మీర, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలపాలి. ఓ రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ కూర్మా రెడీ.

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..