Corn Cutlets: మొక్కజొన్నతో క్రిస్పీగా టేస్టీగా కట్లెట్స్.. మళ్లీ మళ్లీ కావాలంటారు..

ప్రస్తుతం ఇది మొక్క జొన్న సీజన్. ఈ కాలంలో ఎక్కువగా మొక్క జొన్నలు, స్వీట్ కార్న్ లభ్యమవుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కార్న్, స్వీట్ కార్న్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటితో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్నతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా..

Corn Cutlets: మొక్కజొన్నతో క్రిస్పీగా టేస్టీగా కట్లెట్స్.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
Corn Cutlets
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 20, 2024 | 9:59 PM

ప్రస్తుతం ఇది మొక్క జొన్న సీజన్. ఈ కాలంలో ఎక్కువగా మొక్క జొన్నలు, స్వీట్ కార్న్ లభ్యమవుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కార్న్, స్వీట్ కార్న్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటితో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్నతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటితో వడలు వేస్తూ ఉంటారు. ఎప్పుడూ అవే తింటే బోర్ కొడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త వెరైటీగా కట్ లెట్స్ తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. తక్కువ నూనె పడుతుంది. మరి ఈ మొక్క జొన్న కట్ లెట్స్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్క జొన్న కట్లెట్స్‌కి కావాల్సిన పదార్థాలు:

మొక్క జొన్న, ఉడికించిన బంగాళదుంపలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్రెడ్ క్రంబ్స్, కార్న్ ఫ్లోర్, ఆయిల్.

మొక్క జొన్న కట్లెట్స్‌ తయారీ విధానం:

ముందుగా మొక్క జొన్నను శుభ్రంగా కడిగి.. మిక్సీలో వేసి కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఉడికించిన ఆలూ, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేపులో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. కట్లెట్స్ ఉంచాలి.

ఇవి కూడా చదవండి

చిన్న మంట మీద రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ పాన్ ఫ్రై చేస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్స్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే మొక్క జొన్న కట్లెట్స్ సిద్ధం. వీటిని టమాటా కిచెప్, పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. కావాలంటే.. నేరుగా కూడా తినవచ్చు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

మొక్కజొన్నతో క్రిస్పీగా కట్లెట్స్.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
మొక్కజొన్నతో క్రిస్పీగా కట్లెట్స్.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు
ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు
కాంబినేషన్లు కాదు.. కావాల్సింది కంటెంట్‌ అంటున్న ఆడియన్స్
కాంబినేషన్లు కాదు.. కావాల్సింది కంటెంట్‌ అంటున్న ఆడియన్స్
గ్లోబల్‌ స్టార్‌ నయా స్ట్రాటజీ... ఫ్యాన్స్ తో ములాఖత్‌ అందుకేనా
గ్లోబల్‌ స్టార్‌ నయా స్ట్రాటజీ... ఫ్యాన్స్ తో ములాఖత్‌ అందుకేనా
బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..
బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..
తెలంగాణలో దుమ్ముదుమారం.. రాజీవ్ విగ్రహం చుట్టూ రాజకీయం
తెలంగాణలో దుమ్ముదుమారం.. రాజీవ్ విగ్రహం చుట్టూ రాజకీయం
బంగ్లాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ జరిగేది ఎక్కడంటే?
బంగ్లాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ జరిగేది ఎక్కడంటే?
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం..
అలర్ట్.. బాబోయ్‌ వాన..! హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు..
అలర్ట్.. బాబోయ్‌ వాన..! హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు..
సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ..
సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ..