Chicken Majjiga Pulusu: డిఫరెంట్ గా ఇలా చికెన్ మజ్జిగ పులుసు చేయండి.. అదిరి పోతుంది అంతే!
చికెన్ తో మనం చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాం. చికెన్ తో ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లో చాలా మంది ఇష్ట పడి తినే వాటిల్లో చికెన్ ఒకటి. చికెన్ తో కర్రీస్, బిర్యానీలు, స్నాక్స్ ఇలా చాలా చేసుకోవచ్చు. అలాగే మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు. అదేంటి? మజ్జిగ పులుసా అని ఆశ్చర్య పోతున్నారా.. చికెన్ తో చేసే ఈ మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పద్దతిలో ఇలా ఒక్కసారి చికెన్ మజ్జిగ పులుసును చేసుకుంటే.. మళ్లీ మళ్లీ తినాలి అని పిస్తుంది. ఈ మజ్జిగ పులుసు తయారు చేయడం..
చికెన్ తో మనం చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాం. చికెన్ తో ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లో చాలా మంది ఇష్ట పడి తినే వాటిల్లో చికెన్ ఒకటి. చికెన్ తో కర్రీస్, బిర్యానీలు, స్నాక్స్ ఇలా చాలా చేసుకోవచ్చు. అలాగే మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు. అదేంటి? మజ్జిగ పులుసా అని ఆశ్చర్య పోతున్నారా.. చికెన్ తో చేసే ఈ మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పద్దతిలో ఇలా ఒక్కసారి చికెన్ మజ్జిగ పులుసును చేసుకుంటే.. మళ్లీ మళ్లీ తినాలి అని పిస్తుంది. ఈ మజ్జిగ పులుసు తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి టేస్టీగా ఉండే ఈ మజ్జిగ పులుసు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు:
చికెన్, పెరుగు, పచ్చి మిర్చి, ఉల్లి పాయ, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, మెంతులు, ఎండు మిర్చి, ఆవాలు, జీల కర్ర.
చికెన్ మజ్జిగ పులుసు తయారీ విధానం:
చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకునే ముందు.. చికెన్ ఫ్రైని తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా మిక్సీ జార్ లో పచ్చి మిర్చి వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక.. పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. ఉల్లి పాయలు కూడా వేసి వేయించు కోవాలి. ఇవి ఎర్రగా వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. తర్వాత చికెన్ కూడా వేసి కలుపు కోవాలి. నెక్ట్స్ పసుపు, ఉప్పు వేసి కలపాలి.
ఈ చికెన్ బాగా వేగాక.. మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి పేస్ట్ కూడా వేలి బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకూ వేయించు కోవాలి. ఆ తర్వాత గరం మసలా కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి.. పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై బాగా చల్లారాలి. ఈ లోపు మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి పసుపు, ఉప్పు వేసి పెరుగును చిలకాలి.
తర్వాత తాళింపుకు కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసు కోవాలి. ఆయిల్ వేడెక్కాక.. మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాళింపు పెట్టుకోవాలి. దీన్ని మజ్జిగలో వేసి కలుపు కోవాలి. ఇప్పుడు మజ్జిగ పులుసులో చికెన్ ఫ్రై కూడా వేసి కలుపు కోవాలి. దీని అరగంట పాటు అలానే ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ మజ్జిగ పులుసు సిద్ధమవుతుంది. ఏవైనా స్పెషల్ డేస్ లో ఇలా మజ్జిగ పులుసును తయారు చేసుకోవచ్చు.