Capsicum Egg Fry: టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

కోడి గుడ్డ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎగ్‌తో ఎలాంటి కర్రీ, స్నాక్స్ చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఎగ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఎన్నో హెల్దీ పోషకాలు ఉన్నాయి. అదే విధంగా క్యాప్సికం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ చాలా మంది దీన్ని పెద్దగా తినరు. ఇలాంటి వాళ్లు క్యాప్సికం ఎగ్ ఫ్రై ట్రై చేయవచ్చు. ఈ రెసిపీతో రెండు రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఎగ్‌లో వేసి క్యాప్సికం ఎగ్ ఫ్రై చేస్తే..

Capsicum Egg Fry: టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
Capsicum Egg Fry
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 11:06 PM

కోడి గుడ్డ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎగ్‌తో ఎలాంటి కర్రీ, స్నాక్స్ చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఎగ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఎన్నో హెల్దీ పోషకాలు ఉన్నాయి. అదే విధంగా క్యాప్సికం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ చాలా మంది దీన్ని పెద్దగా తినరు. ఇలాంటి వాళ్లు క్యాప్సికం ఎగ్ ఫ్రై ట్రై చేయవచ్చు. ఈ రెసిపీతో రెండు రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఎగ్‌లో వేసి క్యాప్సికం ఎగ్ ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ క్యాప్సికం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

క్యాప్సికం, ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్.

క్యాప్సికం ఎగ్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా క్యాప్సికంని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చి మిర్చిని కూడా కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి, ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్. ఆ నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి ఓ పది నిమిషాల పాటు ఆయిల్‌లో ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

అప్పుడు పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మాసాలా వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఇవన్నీ వేగాక చివరగా గుడ్లు చితక్కొటి వేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేయాలి. చిన్న మంట మీద మాడిపోకుండా వేయించుకోవాలి. కర్రీ బాగా వేగాక.. చివరగా దించే ముందు కొత్తి మీర చల్లి దించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం ఎగ్ ఫ్రై సిద్ధం.