Bread Chilli: టేస్టీ టేస్టీ బ్రెడ్ చిల్లీ.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి!
బ్రెడ్‌తో ఎన్నో రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. వీటిల్లో చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి. బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే అయినా మితంగా తీసుకోవాలి. రోడ్డుపై బండ్లపై కూడా బ్రెడ్‌తో వెరైటీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. వీటిల్లో బ్రెడ్ చిల్లీ కూడా ఒకటి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. స్నాక్స్‌గా తీసుకోవడానికి చాలా బెటర్. కేవలం తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్‌తో ఎప్పుడూ ఒకే ఐటెమ్ కాకుండా ఇలా వెరైటీగా చేయవచ్చు. ఇది అందరికీ నచ్చుతుంది. మరి ఈ టేస్టీ..
బ్రెడ్‌తో ఎన్నో రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. వీటిల్లో చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి. బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే అయినా మితంగా తీసుకోవాలి. రోడ్డుపై బండ్లపై కూడా బ్రెడ్‌తో వెరైటీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. వీటిల్లో బ్రెడ్ చిల్లీ కూడా ఒకటి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. స్నాక్స్‌గా తీసుకోవడానికి చాలా బెటర్. కేవలం తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్‌తో ఎప్పుడూ ఒకే ఐటెమ్ కాకుండా ఇలా వెరైటీగా చేయవచ్చు. ఇది అందరికీ నచ్చుతుంది. మరి ఈ టేస్టీ బ్రెడ్ చిల్లీ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్రెడ్ చిల్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
బ్రెడ్, వెల్లుల్లి తరుగు, అల్లం పొడి, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికం, సోయాసాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కిచప్, కార్న్ ఫ్లోర్ ఉఫ్పు, మిరియాల పొడి, కారం, ఆయిల్.
బ్రెడ్ చిల్లీ తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ల అంచులు కట్ చేసి.. వీటిని ఒకే సైజులో ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాక పక్కకు పెట్టుకోవాలి. నెక్ట్స్ ఇదే కడాయిలో మరో స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో వెల్లుల్లి తరుగు, అల్లం పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం వేసి పెద్ద మంట మీద ఫ్రై చేయాలి. వీటిని పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి.
ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న వాటిల్లో సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కిచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేగా నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు.. కార్న్ ఫ్లోర్ మిశ్రమం కూడా వేసి.. దగ్గరకు చిక్కబడేంత వరకూ ఉడికించాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపు కోవాలి. ఇప్పుడు ఇందులో వేయించిన బ్రెడ్ ముక్కలు కూడా వేసి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ చిల్లీ సిద్ధం.