Ulli Karam Egg vepudu: ఉల్లికారంతో ఇలా కోడిగుడ్డు ఫ్రై చేయండి.. టేస్ట్ వేరే లెవల్ అంతే!

ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ ఐటెమ్స్ తిని బోర్ కొడుతూ ఉంటాయి. ఏమైనా వెరైటీగా కోరుకుంటారు. అలా అని అస్తమానూ బయట నుంచి తీసుకొచ్చి తినలేం. తిన్నా అంత ఆరోగ్యం కూడా కాదు. కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కోడి గుడ్లతో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీలు కాకుండా.. ఇలా వెరైటీగా ఒకసారి ఉల్లికారం గుడ్డు ఫ్రై తయారు చేయండి. ఇవి రెస్టారెంట్స్, హోటల్స్‌లో తయారు చేస్తూ ఉంటారు. ఒక్కసారి రుచి చూశారంటే అందరూ మీకు ఫ్యాన్ అయిపోతారు. వేడి వేడ అన్నంలోకి..

Ulli Karam Egg vepudu: ఉల్లికారంతో ఇలా కోడిగుడ్డు ఫ్రై చేయండి.. టేస్ట్ వేరే లెవల్ అంతే!
Ulli Karam Egg Vepudu
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2024 | 7:00 PM

ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ ఐటెమ్స్ తిని బోర్ కొడుతూ ఉంటాయి. ఏమైనా వెరైటీగా కోరుకుంటారు. అలా అని అస్తమానూ బయట నుంచి తీసుకొచ్చి తినలేం. తిన్నా అంత ఆరోగ్యం కూడా కాదు. కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కోడి గుడ్లతో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీలు కాకుండా.. ఇలా వెరైటీగా ఒకసారి ఉల్లికారం గుడ్డు ఫ్రై తయారు చేయండి. ఇవి రెస్టారెంట్స్, హోటల్స్‌లో తయారు చేస్తూ ఉంటారు. ఒక్కసారి రుచి చూశారంటే అందరూ మీకు ఫ్యాన్ అయిపోతారు. వేడి వేడ అన్నంలోకి వేసుకుని తింటే టేస్ట్ వేరే లెవల్ ఉంటుంది. స్పైసీగా తినేవారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ టేస్టీ ఉల్లికారం కోడిగుడ్డు ఫ్రై ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉల్లికారం కోడిగుడ్డు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆయిల్.

ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తయారీ విధానం:

ముందుగా కోడి గుడ్లను ఉడికించి పెట్టుకోవాలి. ఆ తరవాత ఉల్లిపాయ తొక్కలు తీసి మిక్సీలో వేయాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ముందు కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. నెక్ట్స్ కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం కూడా వేసి.. ఆయిల్ పైకి తేలేంత వరకూ బాగా వేయించు కోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకుంది కొద్దిగా వేసి మరో రెండు, మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కోడి గుడ్లను మధ్యలోకి కోసి ఈ మిశ్రమంలో వేసి.. మంటను సిమ్‌లో పెట్టి మూత పెట్టి పావు గంట సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరిగా కరివేపాకు, కొత్తి మీర వేసి మరోసారి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం కోడిగుడ్డు ఫ్రై సిద్ధం. అంతే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. నీరసంగా ఉండి ఏమీ తినబుద్ధి కావడం లేదు అన్నవాళ్లు ఈ రెసిపీ చేసి పెడితే.. చక్కగా తింటారు.