Rajma Pulao: హెల్దీగా రాజ్మా పులావ్.. కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ..

రాజ్మా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఉడక బెట్టి చాట్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. నేరుగా తినడం ఇష్టం లేని వారు ఇలా వెరైటీగా బిర్యానీ కూడా చేసుకుని తినవచ్చు..

Rajma Pulao: హెల్దీగా రాజ్మా పులావ్.. కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ..
Rajma Pulao 1
Follow us
Chinni Enni

|

Updated on: Nov 01, 2024 | 5:14 PM

నవంబర్ 2వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలా మంది.. ఒక నెల మొత్తం నాన్ వెజ్ తినకుండా ఆ కైలాస నాథుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులు ఇలా కొత్తగా, రుచిగా, హెల్దీగా చేసుకుంటే.. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. బోర్ కొట్టకుండా ఉంటుంది. రాజ్మా ఆరోగ్యానికి చాలా మంది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రాజ్మా నేరుగా తినలేని వారు ఇలా పులావ్‌డగా చేసుకుని కూడా తినవచ్చు. మరి ఈ రాజ్మాతో పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాజ్మా పులావ్‌కు కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన రాజ్మా, బాస్మతీ రైస్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, పులావ్ దినుసులు, ఉప్పు, కారం, పసుపు, శీరా కల్లు.

రాజ్మా పులావ్ తయారీ విధానం:

ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రాజ్మా కూడా నానబెట్టి 80 శాతం ఉడికించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత బాస్మతీ రైస్ శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఓ కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు వేసి వేయించాక.. ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. ఇవి కూడా వేగాక పుదీనా కొత్తిమీర, శీరాకల్లు, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత రాజ్మా, బాస్మతీ రైస్, రైస్ ఉడకడానికి తగినంత నీరు వేసి మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాజ్మా పులావ్ సిద్ధం. దీన్ని ఏ కర్రీతో తిన్నా.. రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. టేస్టీగా, హెల్దీగా ఉండాలి అనుకునేవారికి ఇది బెస్ట్ రెసిపీ. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా, లంచ్‌గా, డిన్నర్‌గా కూడా తినవచ్చు. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!