AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soybean Health Benefits: సోయాబీన్స్‌ తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మీ ఆహారంలో సోయాబీన్‌లను తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహారనిపుణులు. ఇది మీ శరీరానికి సరైన ఎదుగుదలకు అవసరమైన అనేక ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. అధిక బరువుతో ఇబ్బందిపడేవారికి సోయాబీన్స్ బెస్ట్‌ ఫుడ్‌ అంటున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆహారంలో తగిన మొత్తంలో ప్రోటీన్లను చేర్చుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఇంతకీ సోయాబీన్స్‌ తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Nov 01, 2024 | 7:31 PM

Share
సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ అద్భుతమైన మూలం. సోయాబీన్స్‌లో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.  సోయాబీన్స్‌లో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది.

1 / 5
సోయాబీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే వివిధ రకాల పోషకాలను అందిస్తాయి. సోయాబీన్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

2 / 5
సోయాబీన్స్‌ను తీసుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి. ఎముకలను బలంగా మార్చడంలో సోయా బీన్స్‌ సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఈ టైంలో సోయా ఉత్పత్తులు తినడం మంచిది.

3 / 5
సోయాబీన్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. సోయాను తీసుకోవడంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీంతో చర్మం ముడతలు తగ్గిపోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ పానీయాల్లో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. సోయాబీన్ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.

4 / 5
సోయాలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. సోయాబీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సోయాబీన్స్‌ యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్ మాదిరి పని చేస్తాయి. ఈస్ట్రోజన్‌ స్థాయిలను ఇది రెగ్యులేట్‌ చేస్తాయి.

5 / 5
Follow Us
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..

తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..

పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..

రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో

ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..

బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..

నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!

అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో