ఈ 5 తెల్లటి పదార్థాలు విషంతో సమానం.. తినడం బంద్ చేస్తే సగానికి పైగా రోగాలు తగ్గుతాయట..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. ఈ 5 తెల్లని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికారమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు దారితీస్తాయి.

ఈ 5 తెల్లటి పదార్థాలు విషంతో సమానం.. తినడం బంద్ చేస్తే సగానికి పైగా రోగాలు తగ్గుతాయట..
Health Tips
Follow us

|

Updated on: Nov 01, 2024 | 4:56 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే, మీ ఆరోగ్యంలో ఆటంకాలు ఏర్పడటానికి అతి పెద్ద కారణం ఆహారం… అటువంటి పరిస్థితిలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వెంటనే మీ ఆహారం నుంచి ఈ తెల్లని ఆహార పదార్థాలను దూరం చేయాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఉరుకులు పరుగుల నేటి కాలంలో.. చాలామంది పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తింటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడినా.. ఆహారం విషయంలో మాత్రం రాజీ పడకుడదంటున్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా తినడానికి ముందు ఆరోగ్యంపై దాని ప్రభావాల గురించి ఆలోచించకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంటున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ తెల్లని ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రుచికరంగా ఉండవచ్చు.. కానీ ఆరోగ్యానికి విషం కంటే తక్కువ కాదంటున్నారు. ఈ 5 వైట్ ఫుడ్స్ ను దూరం చేస్తే సగానిపైగా సమస్యలు దూరమవుతాయని.. ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు. అటువంటి 5 వైట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి..

తెల్ల చక్కెర: శరీరంలో మంట, కేలరీలు, లిపిడ్లు, చక్కెర స్థాయిని పెంచడానికి తెల్ల చక్కెర బాధ్యత వహిస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

తెల్ల రొట్టె: వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఇందులో ఫైబర్ లేదు, ఇది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా దీన్ని తినడం వల్ల షుగర్ కూడా పెరుగుతుంది.

తెల్ల బియ్యం: తెల్ల బియ్యం, ముఖ్యంగా పాలిష్ చేయడం వల్ల చాలా పోషకాలు కోల్పోతాయి. ఇందులో అత్యధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

తెల్ల ఉప్పు: అధిక మోతాదులో తెల్ల ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. బదులుగా, సముద్రపు ఉప్పు లేదా పింక్ ఉప్పును ఉపయోగించండి.. ఇవి మరింత సహజమైనవి..

తెలుపు వెన్న: వైట్ బటర్ వంటి ప్రాసెస్ చేయబడిన కొవ్వులు గుండెకు హానికరం. బదులుగా ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెల్లగా ఉన్నాయని తెగ తినేస్తున్నారా..? ప్రాణాలు పోతాయ్.. జాగ్రత్త
తెల్లగా ఉన్నాయని తెగ తినేస్తున్నారా..? ప్రాణాలు పోతాయ్.. జాగ్రత్త
స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..
స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..
కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసి అవమానించిన సినిమా ఇదే..
కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసి అవమానించిన సినిమా ఇదే..
ఇలా క్లీన్ చేస్తే వాటర్ బాటిల్స్ లోపలి నుంచి కూడా శుభ్రపడతాయి..
ఇలా క్లీన్ చేస్తే వాటర్ బాటిల్స్ లోపలి నుంచి కూడా శుభ్రపడతాయి..
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా.. ఆ మ్యాచ్‌ రద్దు చేసిన బీసీసీఐ
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా.. ఆ మ్యాచ్‌ రద్దు చేసిన బీసీసీఐ
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై 'దీపావళి' వెలుగులు.. కలర్ ఫుల్
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై 'దీపావళి' వెలుగులు.. కలర్ ఫుల్
ఈ చిన్న గింజలు బాదం, వాల్‌నట్స్‌ కంటే రెట్టింపు ప్రయోజనం.!ఎముకలకు
ఈ చిన్న గింజలు బాదం, వాల్‌నట్స్‌ కంటే రెట్టింపు ప్రయోజనం.!ఎముకలకు
జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..?కొత్త నిబంధన తెలుసుకోవాల్సిందే
జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..?కొత్త నిబంధన తెలుసుకోవాల్సిందే
ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్..
ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్..
ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు..
ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు..