Paneer Nuggets: టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి..

పన్నీర్‌తో కూడా ఎన్నో రకాల వెరైటీ స్నాక్స్ తాయరు చేసుకోవచ్చు. పన్నీర్ తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఇప్పుడు నగేట్స్‌ని ఎక్కువగా స్నాక్‌లా పెడుతున్నారు. పన్నీర్‌తో కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి మంచిది..

Paneer Nuggets: టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి..
Paneer Nuggets
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 01, 2025 | 7:53 AM

ప్రస్తుత కాలంలో స్నాక్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. ఎక్కువగా పిల్లలు కూడా స్నాక్స్ తినేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పన్నీర్‌తో కూడా ఎన్నో రకాల వెరైటీ స్నాక్స్ తాయరు చేసుకోవచ్చు. పన్నీర్ తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఇప్పుడు నగేట్స్‌ని ఎక్కువగా స్నాక్‌లా పెడుతున్నారు. పన్నీర్‌తో కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి మంచిది. పన్నీర్‌తో మరి ఈ నగేట్స్ ఎలా తయారు చేస్తారు? ఈ నగేట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

పన్నీర్ నగేట్స్‌కి కావాల్సిన పదార్థాలు:

పన్నీర్, బ్రెడ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మొక్కజొన్న పిండి, మైదా పిండి, నిమ్మకాయ రసం, ఆయిల్, కొత్తిమీర తురుము.

పన్నీర్ నగేట్స్‌ తయారీ విధానం:

ఈ స్నాక్ రెసిపీని చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ముందుగా పన్నీర్‌ని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి. ఇప్పుడు వీటికి కోటింగ్ ఇవ్వాలి. ఖాళీగా ఉండే బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మొక్కజొన్న పిండి, మైదా పిండి, నిమ్మకాయ రసం, కొత్తిమీర తురుము వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఓ గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ముక్కలకు కోటింగ్ బాగా పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వెడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను.. బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించి.. ఆయిల్‌లో వేసి అన్ని వైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ నగేట్స్ సిద్ధం. వీటిని టమాటా సాస్ లేదా మయోనీస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి. ఇవి పిల్లలకు బాగా నచ్చుతాయి. పెద్దలు అయితే లొట్టలేసుకుంటూ తింటారు. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?