Health Benefits of Apricots : ఇది పండుకాదు అమృతఫలం.. ప్రతిరోజూ ఒక్కటి తిన్నాచాలు ఊహించని లాభాలు..

ఆప్రికాట్లో ఉండే ఫైటోకెమికల్స్‌ వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకుని తింటారు. ఇవి వంటలలో రుచిని పెంచుతాయి. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేగులను శుభ్రం చేస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. వృద్ధాప్యచాయలను దరిచేరకుండా చేస్తుంది.

Health Benefits of Apricots : ఇది పండుకాదు అమృతఫలం.. ప్రతిరోజూ ఒక్కటి తిన్నాచాలు ఊహించని లాభాలు..
Apricots
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 31, 2024 | 9:01 PM

ఆప్రికాట్లు పరిమాణంలో చిన్నగానే ఉంటాయి. గుండ్రం, పసుపు రంగులో, పీచును కలిగి రేగుపండ్ల మాదిరిగా ఉంటాయి. కానీ, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనేకం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆప్రికాట్స్ తినడం వలన శరీరంలోని పలు సమస్యలు తొలగిపోతాయి. ఆప్రికాట్లు అనేక పోషక విలువలతోపాటు మెరుగైన జీర్ణక్రియ, కంటి ఆరోగ్యానికి కూడా అతి ముఖ్యమైనవిగా పనిచేస్తాయంటున్నారు. ఆప్రికాట్స్‌లో విటమిన్ సి, ఎ, ఫైటోన్యూట్రియెంట్‌ల కలయిక చర్మానికి మేలు చేస్తాయి. అవి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణకు ఆప్రికాట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బాగా సహాయపడుతుంది.

మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పని చేస్తాయి. ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఆప్రికాట్లో ఉండే ఫైటోకెమికల్స్‌ వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకుని తింటారు. ఇవి వంటలలో రుచిని పెంచుతాయి. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేగులను శుభ్రం చేస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. వృద్ధాప్యచాయలను దరిచేరకుండా చేస్తుంది.

ఒక కప్పు ఎండిన ఆప్రికాట్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..