21 రోజుల నో షుగర్ ఛాలెంజ్‌ ట్రై చేయండి.. శరీరంలో ఎన్ని మార్పులు కనిపిస్తాయో తెలుసా 

03 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

షుగర్ తో చేసిన స్వీట్స్ తింటే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.  నో షుగర్ ఛాలెంజ్  ట్రెండ్ అవుతోంది. 21 రోజులు నో షుగర్ ఛాలెంజ్ తీసుకోవడం ద్వారా స్వీట్లు తినే అలవాటును వదులుకోవచ్చు.

 నో షుగర్ ఛాలెంజ్

అధిక చక్కెర వినియోగం బరువు పెరగడానికి ప్రధాన కారణం. చక్కెర తినక పొతే శరీరంలోని కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

బరువు తగ్గించడంలో

ఎక్కువ చక్కెర తినడం వలన మానసిక కల్లోలం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. మీరు దీన్ని నివారించాలనుకుంటే, చక్కెర లేదా స్వీట్లు తీసుకోవద్దు. 21 రోజుల నో షుగర్ ఛాలెంజ్‌ని అనుసరించి మానసికంగా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండండి. 

మానసిక ఆరోగ్యం

ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తింటే మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. స్వీట్స్ తగ్గిస్తే ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు.  

ఆకలిపై ప్రభావం

అధికంగా చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరం. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం వంటి అనేక వ్యాధులకు కారణమవుతుంది.  

గుండె జబ్బుల నివారణ 

ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో మంట వస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. చక్కెరను వదిలివేయడం వల్ల మంట తగ్గుతుంది, రోగనిరోధక వ్యవస్థను బలపడుతుంది.

రోగనిరోధక శక్తి 

చక్కెరను వదిలివేయడం వల్ల శరీరం నుంచి విషం తొలగుతుంది. ఇది నిర్విషీకరణ ప్రక్రియను వేగవంతం అవుతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

 శరీర నిర్విషీకరణ

ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మొటిమలు, అకాల ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. నో షుగర్ ఛాలెంజ్ వల్ల చర్మం క్లియర్‌గా , మెరుస్తూ ఉంటుంది. అంతేకాదు చాలా కాలం పాటు చర్మం యవ్వనంగా ఉంటుంది.

చర్మ ఆరోగ్యానికి 

ఎక్కువ చక్కెర తినడం వలన ఎనర్జీ లెవల్స్ త్వరగా పెరుగుతాయి ..అంతే వేగంగా పడిపోతాయి. అయితే షుగర్ కు దూరంగా ఉంటే శక్తి స్థాయి స్థిరంగా ఉంటుంది. శరీరం రోజంతా చురుకుగా ఉంటుంది. శరీరంలో చాలా మంచి మార్పులు వస్తాయి.  

స్థిరంగా ఎనర్జీ లెవల్స్