పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

01 January 2025

Jyothi Gadda

TV9 Telugu

నిమిషాల వ్యవధిలో టీ, కాఫీలను సేవించి చెత్తబుట్టలో పడేసే వీలుండటం, కడిగేపనిలేకుండా ఈజీగా ఉండటంతో పేపరు కప్పులు, గ్లాసుల వినియోగం పెరిగిపోయింది. 

TV9 Telugu

కానీ, ఇంత ఆరోగ్యానికి అత్యంత ప్రాణాంతకం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. పేపర్ కప్‌లు వేడి పానీయాలు పోస్తే, పేపర్‌పై ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ కరిగే అవకాశాలు ఉంటాయి. 

TV9 Telugu

ఈ ప్లాస్టిక్ తరచుగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలిన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి కరిగినప్పుడు, సూక్ష్మపరిమాణంలో రసాయనాలు వేడిగా ఉండే చాయ్ లేదా కాఫీకి కలవవచ్చు.

TV9 Telugu

కొన్ని పేపర్ కప్పులు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు విషపదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. పేపర్ కప్పులు పర్యావరణానికి కూడా హానికరం. 

TV9 Telugu

పేపర్‌ కప్పులో వేడి కాఫీ, టీలు తాగినప్పుడు, ప్లాస్టిక్ అయాన్లతో పాటు, భారీ లోహాలతో మిళితమై ఉన్న వాటిని సేవించటం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

TV9 Telugu

పేపరు కప్పులు, గ్లాసులకు ఉండే పై పొరలో ప్లాస్టిక్‌ అయాన్లతోపాటు జింక్, మాంగనీస్, నికెల్, కాపర్, లెడ్, కాడ్మియం, క్రోమియం, పల్లాడియం లాంటి భారీ లోహాలు ఉంటాయట.

TV9 Telugu

పేపరు కప్పుల వాడకం ముఖ్యంగా నరాలకు సంబంధించిన జబ్బులైన పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ , సంతానలేమి వంటి సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

TV9 Telugu

పేపర్ కప్పుపై డిజైన్‌లో రసాయనాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది స్లో పాయిజన్‌గా పని చేస్తుంది. 

TV9 Telugu