బుక్‌ చేసిన ట్రైన్ టికెట్ తేదీ, క్లాస్ మార్చవచ్చా.?

TV9 Telugu

03 January 2025

రైలు టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణ తేదీ మార్చుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్ తెలిపింది రైల్వే శాఖ.

ఒక్కోసారి అనివార్య కారణాలతో రైలు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. రైల్ టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సందే!

ఇకపై మీరనుకున్న తేదీకి ముందుగానీ.. తర్వాతగానీ ట్రైన్ లో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తుంది భారత రైల్వే శాఖ.

ఎలాంటి క్యాన్సిలేషన్‌ ఛార్జీలు లేకుండానే ప్రయాణించాల్సిన తేదీని, ఆప్‌గ్రేడ్ చేసుకోవడం ఇకపై అంతంత సులభతరం.

కొత్త రైల్వే పాలసీ ప్రకారం.. రైలు బయలుదేరడానికి రెండు రోజుల ముందే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాల్స ఉంటుంది.

రిజర్వేషన్‌ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా కొత్త తేదీ ఓకే అనుకుంటే టికెట్‌ను అప్పటికి మార్చుకుని నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చు.

ఒకవేళ మీరనుకున్న క్లాస్‌లో టికెట్‌ దొరకనప్పుడు కూడా అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తుంది భారత రైల్వేస్.

క్లాస్‌ అప్‌గ్రేడ్‌ అయితే మాత్రం కచ్చితంగా అదనపు ఛార్జీని చెల్లించాలి. లేదంటే బుక్‌ చేసుకున్న క్లాస్‌లోనే ప్రయాణించే అవకాశం లభిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు.

మరోవైపు టికెట్‌ బుక్‌ చేసుకున్న కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును కూడా భారతీయ రైల్వే కల్పిస్తోంది.