Guava Chutney: జామకాయ చట్నీ.. డయాబెటీస్, వెయిట్ లాస్ వాళ్లకు బెస్ట్!

జామ కాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జామ కాయతో స్వీట్ ఐటెమ్స్ వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ దీంతో జామ కాయ చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇది డయాబెటీస్ పేషెంట్లకు, బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ జామ చట్నీ చక్కగా పని చేస్తుంది. ఇది చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు..

Guava Chutney: జామకాయ చట్నీ.. డయాబెటీస్, వెయిట్ లాస్ వాళ్లకు బెస్ట్!
Guava Chutney
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 28, 2025 | 9:20 PM

మన చుట్టూ ఉండే వాటిల్లో మనకు సులభంగా లభించేంది జామకాయ. జామకాయ, జామ ఆకులు, జామ బెరడు అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి న్యూట్రిషియన్ వాల్యూస్ కలిగిన వాటిల్లో ఇవి కూడా ఒకటి. వీటితో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. జామ కాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జామ కాయతో స్వీట్ ఐటెమ్స్ వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ దీంతో జామ కాయ చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇది డయాబెటీస్ పేషెంట్లకు, బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ జామ చట్నీ చక్కగా పని చేస్తుంది. ఇది చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. మరి ఈ జామ చట్నీ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జామ కాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు:

జామ కాయ, కొత్తిమీర, పచ్చి మిర్చి, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు.

ఇవి కూడా చదవండి

జామ కాయ చట్నీ తయారీ విధానం:

ముందుగా జామ కాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి మిక్సీలోకి తీసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు, జీలకర్ర, నిమ్మరసం వేయాలి. వీటన్నింటినీ మెత్తగా అయ్యేలా పేస్టులా తయారు చేసుకోవాలి. దీనికి తాళింపు పెట్టాల్సిన పని లేదు. అసలు ఆయిల్‌తోనే పని ఉండదు. ఇలా ఈజీగా ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. చపాతీలు, అన్నంతో తినవచ్చు. నేరుగా కూడా ఈ జామ కాయ చట్నీని తినొచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఎవరైనా తినొచ్చు. ముఖ్యంగా బరువు తగ్గేవారు, డయాబెటీస్‌ ఉన్నవారు ఈ చట్నీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.