AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరచూ దొండకాయ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

అంతేకాదు..బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగిస్తుంది. ఐరన్‌ లోపంతో బాధ పడేవారు దొండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియా సమస్యతో బాధ పడే వారికి చక్కగా పని చేస్తుంది.

తరచూ దొండకాయ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
దొండకాయలలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. దొండకాయలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. బరువు అదుపులో ఉంటుంది. దొండకాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వాపులు, నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తాయి. దొండకాయలు తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Jyothi Gadda
|

Updated on: Jan 28, 2025 | 9:37 PM

Share

సాధారణంగా దొండకాయ అంటే చాలా మంది ఇష్టపడరు.. ఎందుకంటే..దొండకాయ తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని బలంగా నమ్ముతారు. కానీ, ఇవేవీ నిజం కాదంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు.. దొండకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదలిపెట్టరని కూడా అంటున్నారు. అంతేకాదు..ఆయుర్వేదంలో కూడా దొండకాయకు ముఖ్యమైన ప్రధానం ఉందంటున్నారు. ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా దొండకాయను ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. దొండకాయలో ఫైబర్‌, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. షుగర్‌ బాధితులు వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో డైటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో థయామిన్‌ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మారుస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ సజావుగా జరుగుతుంది. అల్సర్లు, గ్యాస్‌ వంటి సమస్యలను దొండకాయ దూరం చేస్తుంది. దీనిలో సమృద్ధిగా బీటా కెరోటిన్‌ లభిస్తుంది. అది విటమిన్‌ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది.

దొండకాయ తింటే మతిమరుపు, మందబుద్ధి వస్తాయని అనుకుంటారు. అయితే ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి అల్జీమర్స్‌ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు..బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగిస్తుంది. ఐరన్‌ లోపంతో బాధ పడేవారు దొండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియా సమస్యతో బాధ పడే వారికి చక్కగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్